Nalgonda : 24 గంటల్లో దొంగని అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు..!
Nalgonda : 24 గంటల్లో దొంగని అరెస్టు చేసిన నల్గొండ పోలీసులు..!
నల్లగొండ, మన సాక్షి :
చోరీ జరిగిన వివరాలు గంటల్లో నేరస్తురాలని నల్లగొండ పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈనెల 8వ తేదీననల్గొండ పట్టణం, శాంతి నగర్ కాలని, బాలాజీ ఫంక్షనల్ హాల్ దగ్గర నివాసం ఉంటున్న మలాన్ బి అలియాస్ నజ్మా ఉదయం కుటుంబ సమేతంగా ఆమె చెల్లి ఫంక్షన్ కి వెళ్లి తిరిగి ఇంటికి అదేరోజు రాత్రి 8 గంటలకు వచ్చారు.
ఇంటి బీరువాలో పెట్టిన 9.4 తులాల బంగారు ఆభరణాలు (నల్ల పూసలు గొలుసు (03 తులాలు), బంగారు చైన్ (02 తుళాలు), ఒక జత బంగారు గాజులు (03 తులాలు), బంగారు చెవి బుట్టాలు (11.5 గ్రాములు) మరియు ఒక బంగారు ఉంగరం (2.5 గ్రాములు) దొంగిలించబడినవి. ఫిర్యాదు మేరకు నేరస్త్రాలని అరెస్టు చేసినట్లు వన్ టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కేసు నమోదు చేసి,ఎస్ఐ లు సందీప్ రెడ్డి, శంకర్ లను రెండు బృందాలుగా క్రైమ్ పార్టీ సిబ్బందితో యుక్తంగా సమీప సిసిటివి కెమరాలను పరిశీలించి, ప్రియదర్శిని కాలనీ లో ఉంటున్న కొత్తపల్లి ధనలక్ష్మిని నేరస్తురాలుగా గుర్తించారు.
ఉదయం ఆమె కిరాయికి ఉంటున్న ఇంటి వద్ద పట్టుబడి చేసి ఆమె వద్ద నుండి దొంగిలించిన సొత్తుని స్వాదీనం చేసి రిమాండ్ చేయడం జరిగింది. ఈ కేసును 24 గంటలలో ఛేదించిన అధికారులను సిబ్బందిని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ అభినందించారు.
ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి నిందితురాలిని సీసీటీవీ కెమెరాల ద్వారా 24 గంటలలో పట్టుబడి చేసి దొంగిచించిన సొత్తుని రికవరీ చేసిన నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డిని, ఎస్ఐ లు సందీప్ రెడ్డి, శంకర్ క్రైమ్ సిబ్బంది షకీల్, శ్రీకాంత్ లను నల్గొండ యస్. పి శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ గారు అభినందించారు.
ప్రతి చోటా సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని అప్పుడే నేర నియంత్రణకు అరికట్టవచ్చునని ప్రతి గ్రామాలలో, పట్టణాలలో, వ్యాపార సముదాయాలు, రహదారి కూడలిలో సిసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ప్రకటనలో కోరారు.
సీసీటీవీ ల ద్వారా దొంగతనాలు, రోడ్డు ప్రమాదాల ఇతర నేరాలు జరిగినప్పుడు సిసి కెమెరాల ద్వారా నిందితులను గుర్తించవచ్చునని తెలిపారు.సీసీటీవీ కెమెరాల ద్వారా నేర నియత్రణ అదుపులోకి వస్తుందని అన్నారు.
LATEST UPDATE :
Good News : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి గుడ్ న్యూస్.. పుస్తకాలు సౌకర్యాలు ఉచితంగా..!
Suryapet : చిట్టి చేతులు.. భారీ సహాయం..!
Holidays : వరుస సెలవుల్లో ఆరోజు రద్దు.. ప్రభుత్వం కీలక నిర్ణయం..!
Viral : ఉపాధ్యాయ దినోత్సవం రోజు టీచరమ్మ డ్యాన్స్.. నేటిజెన్ల కామెంట్స్ చూస్తే.. (వీడియో)









