Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsక్రైంజిల్లా వార్తలుతెలంగాణనారాయణపేట జిల్లా

Murder : హత్యకు దారి తీసిన చిన్న వివాదం.. కేసును చేదించిన పోలీసులు..!

Murder : హత్యకు దారి తీసిన చిన్న వివాదం.. కేసును చేదించిన పోలీసులు..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

ఇద్దరు వ్యక్తుల మధ్య డబ్బు మద్యం విషయంలో చిన్నగా మొదలైన గొడవ చివరకు వ్యక్తిని హత్య చేసే వరకువెళ్ళింది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్ పోలీస్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మర్డర్ కేసు కు సంబంధించిన విషయాలు వెల్లడించారు..

5న అర్ధరాత్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ఓ వ్యక్తిని హత్య చేసి నిప్పంటించి ఉన్న మృతదేహాన్ని గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు.హత్యగావింపబడ్డ వ్యక్తినీ చూడటానికి వచ్చిన వ్యక్తి అ మృతదేహం తన తమ్ముడిదని తన తమ్ముడిని చంపిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోమని హత్యగావింపబడ్డ అన్న దాసరి నారాయణ ఫిర్యాదు చేశాడు. ఇట్టి కేసును నమోదు చేసుకున్న పోలీసులుడి.ఎస్.పి లింగయ్య ఆధ్వర్యంలో సిఐ కె. శివశంకర్ సిబ్బందితో విచారణ ప్రారంభించారు.

ఇట్టి విచారణలో దాసరి మారుతిని జిల్లా కేంద్రం లోని పళ్ళబుజూర్గు నివాసి అయిన ఉప్పరి నర్సిములు అలియాస్ నజీర్ తండ్రి సాదిక్ అనే వ్యక్తి హత్య చేశాడని తెలిపారు.నిందితుడిపై గతంలో నేరచరిత ఉన్నట్లు తమ విచారణలో తేలిందని ఎస్పీ వెల్లడించారు. 4న రాత్రి 11 గంటల తర్వాత తాగిన మైకంలో మధ్యమును డబ్బునుగుజ్జు కొనుటకు ప్రయత్నించగాఇద్దరి మధ్య గొడవ జరిగిందని గొడవతో కోపద్రిక్తుడైనఉప్పరి నర్సింలు అలియాస్ నజీర్ దాసరి మారుతిని జిల్లా ఆసుపత్రి వెనుక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి రాయితో బలంగా తలపై కొట్టి మారుతిని కొట్టి హతమార్చినట్లు తెలిపారు.

నిందితున్ని కోర్టులో హాజరు పరిచి రి రిమాండ్ కు తరలిస్తున్నట్టు ఎస్పీ తెలిపారు ఈ కేసు చేదనలో కృషిచేసిన ఎస్సై వెంకటేశ్వర్లు సిబ్బందికి ఎస్పి వారికి నగదు రివార్డు అందజేశారు.

ALSO READ : 

BIG BREAKING : సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి, పలువురికి గాయాలు..!

Rythu Bharosa New Rules : రైతు భరోసా కొత్త రూల్స్.. రైతులకు హెచ్చరిక..!

Buddhavanam Entry Tickets : నాగార్జున సాగర్ బుద్ధవనం ఎంట్రీ టికెట్ ధరలు..!

మరిన్ని వార్తలు