TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకుగాను నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. 2 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను అందించేందుకు కొత్తగా పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ పథకానికి ముందుగానే దరఖాస్తులు స్వీకరించి.. భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి (ఏప్రిల్ 14)వ తేదీన ఈ నూతన పథకాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
అంబేద్కర్ జయంతి సందర్భంగా శ్రీకారం చుట్టే ఈ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు బ్యాంకుల ద్వారా రుణ సదుపాయం కల్పించనున్నారు. వీరికి ప్రస్తుతం 3000 కోట్ల రూపాయలతో వివిధ కార్పోరేషన్ల ద్వారా రుణాలు అందిస్తుండగా.. మరో మూడు వేల కోట్ల రూపాయల ద్వారా బ్యాంకుల ద్వారా రుణాలు అందించనున్నారు. అందుకు సంబంధించిన మార్గదర్శకాలను సిద్ధం చేస్తుంది. అర్హుల ఎంపిక రుణాల మంజూరు ప్రక్రియ త్వరలో చేపట్టనున్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ యువత ఆర్థికంగా స్థిరపడేందుకు ఈ స్వయం ఉపాధి పథకాలు ఉపయోగపడనున్నాయి. ఈ పథకం ద్వారా 50వేల రూపాయలు, ఒక లక్ష రూపాయలు, రెండు లక్షల రూపాయల వరకు మంజూరు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం రాయితీ, మార్జిన్ మనీ అందించి బ్యాంకుల ద్వారా రుణ సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ పథకం చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాల ఏర్పాటుకు అవకాశం కల్పించనున్నారు.
ఈ పథకానికి మహిళలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హులైన వారు తమ యూనిట్ కు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక సమర్పించాలి. సంబంధిత కార్పొరేషన్, బ్యాంక్ అధికారులతో కూడిన కమిటీ అర్హులను ఎంపిక చేస్తుంది. ఎంపికైన వారికి రుణాలు మంజూరు చేస్తారు. ఈ నూతన పథకం ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
MOST READ :
-
TG News : తెలంగాణలో విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో నేటి నుంచి యూపీఐ కొత్త రూల్స్.. మీ ఖాతాలలో డబ్బులు బ్లాక్..!
-
Gold Price : వరుసగా నాలుగో రోజు కుప్పకూలిన బంగారం ధర.. ఇదే మంచి తరుణం..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై డిప్యూటీ సీఎం భట్టి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!
-
Rythu Bharosa : ఏదీ రైతు భరోసా.. ఆర్థిక శాఖ పక్కన పెట్టిందా.. లేటెస్ట్ అప్డేట్..!









