అద్భుతం : డ్రైవర్ లేకుండా.. పొలం దున్నే ట్రాక్టర్ (వీడియో)

అద్భుతం : డ్రైవర్ లేకుండా.. పొలం దున్నే ట్రాక్టర్ (వీడియో)

మనసాక్షి : వెబ్ డెస్క్ :

వ్యవసాయం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి రైతులు సాగు చేస్తున్నారు. అదేవిధంగా శాస్త్రవేత్తలు కూడా వ్యవసాయానికి అనుగుణమైన యంత్రాలను ఆధునిక టెక్నాలజీ తో తయారు చేస్తున్నారు.

కాగా ఇటీవల వరంగల్ కు చెందిన కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ లో యువ ఇంజనీర్లు అద్భుతమైన టెక్నాలజీని కనిపెట్టారు. ఆ బృందం డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ తో పొలం దున్నే టెక్నాలజీని కనిపెట్టారు. దానిని ఇటీవల ఆవిష్కరించారు . కాగా దానిని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో వీడియో తో సహా పోస్ట్ చేశారు.

వ్యవసాయం యొక్క భవిష్యత్తు , సామాజిక ప్రభావాన్ని చూపాలనుకునే యువ ఆవిష్కరణలు, ఇలాంటి మరిన్ని ఆలోచనలు ఉత్పత్తులతో బయటకు రావాలని నేను కోరుకుంటున్నాను. అని కేటీఆర్ ట్వీట్ చేశారు.

పొలం దున్నే ట్రాక్టర్ వీడియో