సూర్యాపేట : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కదు

సూర్యాపేట : రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్ కూడా దక్కదు

సూర్యాపేట, మనసాక్షి

టిఆర్ఎస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ప్రస్తుతం బి ఆర్ఎస్ పార్టీ కి వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట నియోజకవర్గ లో డిపాజిట్ కూడా దక్కదని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు.

 

ఆదివారం జిల్లా కేంద్రంలో 43 వ వార్డులో వార్డు కౌన్సిలర్ నామ అరుణ ప్రవీణ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు గుంజ శ్రీనివాస్ తో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ రమేష్ రెడ్డి మాట్లాడారు.

 

దేశ ప్రజలను విభజించి పాలించి లబ్ధి పొందే బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని కాంగ్రెస్ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయని తెలిపారు. ఎన్నడూ లేని విధంగా కర్ణాటక రాష్ట్రంలో 136 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు చరిత్రని ఈ గెలుపు వెనుక భావి ప్రధాని రాహుల్ గాంధీ ,మల్లికార్జున కార్గే, ప్రియాంక గాంధీ, కృషి ఉందన్నారు.

 

ఎన్నడూ లేనివిధంగా బిజెపి ప్రభుత్వ పాలనలో గ్యాస్ కు 1200, పెట్రోల్ కు 110 ,డిజిల్కు 100 పెరిగిందని కనీసం సామాన్యుడు బతికే పరిస్థితి లేదన్నారు. నిత్యవసర వస్తువులు రోజురోజు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

 

.రైతులకు మద్దతు ధర అందే పరిస్థితి లేదని, పింఛన్లు రావడం లేదని, రేషన్ కార్డులు రావడంలేదని, డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, అందే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కేవలం నలుగురి కోసం మాత్రమే వచ్చింది అనే విధంగా మారిందని సీఎం కేసీఆర్ ఆయన కుటుంబం, జిల్లాలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆయన బినామీలు మాత్రమే రాష్ట్ర ఫలాలను అనుభవిస్తున్నారు.

 

పట్టణంలో మంచినీటి సౌకర్యం లేదని దోమల బెడదతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ పాలనలో 10 సంవత్సరాల్లో సూర్యాపేట నియోజకవర్గంలో 20 వేల ఇందిరమ్మ ఇండ్లు కట్టిచ్చిస్తే మంత్రి జగదీశ్వర్ రెడ్డి నియోజకవర్గమైన సూర్యాపేటలో కేవలం 400 ఇండ్లు మాత్రమే ఇప్పటివరకు పంపిణీ చేయడం జరిగింది. కాంగ్రెస్ వస్తేనే పేదలకు న్యాయం జరుగుతుందని ప్రజలు నమ్ముతున్నారు.

 

కాంట్రాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ని బినామీగా చేసుకుని కోటి రూపాయల పని నుంచి 100 కోట్ల పనైనా అతనికి కట్టబెడుతూ 30% కమిషన్ తీసుకుంటూ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వేల కోట్లు సంపాదించుకుంటున్నాడన్నారు.

 

అవినీతిపరుడైన మున్సిపల్ కమిషనర్ బదిలీపై హైదరాబాద్కు వెళ్తే తిరిగి మున్సిపల్ కమిషనర్ను సూర్యాపేటకు రప్పించుకొని మంత్రి జగదీశ్వర్ రెడ్డి కమిషన్లను వాటాలను పంచుకుంటున్నారని ఆరోపించారు.

 

సూర్యాపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ కూడా రాదని స్పష్టం చేశారు. అనేకమంది బీఆర్ఎస్ నాయకులు తనకు టచ్ లో ఉన్నారని త్వరలోనే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమన్నారు. మంత్రి జగదీశ్వర్ రెడ్డిని సూర్యాపేట నియోజకవర్గం నుంచి ఓడించి నాగారాన్ని పంపించడానికి ప్రజల సిద్ధమయ్యారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 43 వ వార్డులో కమ్యూనిటీ హాల్ నిర్మించి ప్రజలకు అందుబాటులో తెస్తానని హామీ ఇచ్చారు.

గుంజ శ్రీనివాస్ 43వ వార్డు తెరాస వార్డు అధ్యక్షుడు వారితో పాటు 200తెరాస కార్యకర్తలు 43వ వార్డు కౌన్సిలర్ నామ అరుణ ప్రవీణ్ అధ్వర్యంలో రాంబాబు, రవి. మొక్కల రవి. గుంజ వంశీ. భక్తుల సాయికిరణ్, జగన్, మహేష్, విక్కీ, ఉదయ్, శివమ్మ, వరలక్ష్మి, గంగమ్మ, రంగమ్మ, సైదులు, బాబు, నాగరాజు, లక్ష్మయ్య, యశ్వంతు, విజయ్, జయమ్మ, స్వప్న, అనసూయ, కుమారి, కవిత తో పాటు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.