నిరంకుశ పాలనకు చరమగీతం పడాలి..!

గత తొమ్మిదేళ్ల కాలం నుండి తెలంగాణ రాష్ట్రం నిరంకుశ పాలకుల చేతిలో బంది అయిందని రాబోయే ఎన్నికల్లో ఆ కుటుంబ పాలకులను చరమగీతం పాడే రోజులు ఆసన్న మయ్యాయని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.

నిరంకుశ పాలనకు చరమగీతం పడాలి..!

పీసీసీ సభ్యులు బాలు నాయక్

చింతపల్లి, మన సాక్షి.

గత తొమ్మిదేళ్ల కాలం నుండి తెలంగాణ రాష్ట్రం నిరంకుశ పాలకుల చేతిలో బంది అయిందని రాబోయే ఎన్నికల్లో ఆ కుటుంబ పాలకులను చరమగీతం పాడే రోజులు ఆసన్న మయ్యాయని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ అన్నారు.

ఆదివారం చింతపల్లి మండల పరిధిలోని కుర్మేడ్ ఎక్స్ రోడ్ లోని భాగ్యమ్మ ఫంక్షన్ హాల్ లో కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కురుమేడు, గొల్లపల్లి, ప్రశాంతి పూరి తండాల నుండి బి ఆర్ ఎస్, బిజెపి పార్టీల నుండి సుమారు 200 మంది కార్యకర్తలు ఆయా పార్టీలకు రాజీనామాలు చేసి దేవరకొండ మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలను బాలు నాయక్ వారిని సాదరంగా ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ కండువను కప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనతో ప్రజలు విసిగి వేశారా రని, తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ప్రాంతాలను వాటాలుగా పంచుకుంటున్నారని విమర్శించారు.

ALSO READ : Ration Card : రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఈ – కేవైసీ తప్పనిసరి చేయించుకోవాలా.. ఎలా, ఎక్కడ చేయించుకోవాలంటే..!

నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ యువతను నడిసముద్రంలో ముంచి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని విధాలుగా వాడుకున్నారని యువకులు ఆ విషయాన్ని మర్చిపోలేరన్నారు. ఎన్నికల సమయం ఆసన్నం కాగానే ముఖ్యమంత్రి కెసిఆర్ ఊసరవెల్లి రంగులు మారుస్తూ కల్లబొల్లి మాటలు చెప్పి గారడి చేయాలని మరోసారి ముందుకు రాబోతున్నారని అలాంటి నియంతను యువతీ యువకులు రాబోయే ఎన్నికల్లో ఓటు ఆయుధంతో బొంద పెట్టాలన్నారు.

యువతకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి సమస్యలపై పోరాటాలు చేసే యువతి యువకులపై ఉక్కు పాదం మోపడం కేసులు బనాయించడం సిగ్గుచేటు అన్నారు. మలిదశ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు బలిదానాలకు చలించిపోయిన ఆనాటి ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తును పక్కనపెట్టి ప్రత్యేక తెలంగాణ ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ మర్చి పోయి నేనే తెలంగాణ రాష్ట్రం తెచ్చానని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

ALSO READ : Ts Rtc : ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ దసరా కానుక.. టికెట్ పై రాయితీ, ఎప్పటినుంచంటే..!

తొమ్మిదేళ్ల కాలం నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఏం వరగబెడుతున్నారో గమనిస్తున్నారన్నారు. నీవు తెలంగాణ యువతను ఏ విధంగా మోసం చేశావో అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా నీకు అదే గుణపాఠం చెప్పడం ఖాయం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ నేని, అందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు సంసిద్ధంగా ఉన్నారన్నారు. దేవరకొండ ఖిల్లా పై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు.

ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలు చింతపల్లి మండల పార్టీ అధ్యక్షులు ఆంగిరేకులు నాగభూషణం, జిల్లా నాయకులు దొంతం సంజీవరెడ్డి, ఎంపీపీ కొండూరు భవాని పవన్ కుమార్ వైస్ ఎంపీపీ యాచారం యాదగిరి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ యాదవ్, జిల్లా నాయకులు దొంతిని వెంకటేశ్వరరావు, పి ఎస్ ఎ చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య,

ALSO READ : BIG BREAKING : టీఎస్పిఎస్సి గ్రూప్ -1 ప్రిలిమ్స్ మళ్లీ రద్దు..!

జిల్లా నాయకులు ఎరుకల వెంకటయ్య గౌడ్, గోవర్ధన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి జటావత్ హరినాయక్, రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ యువజన ప్రధాన కార్యదర్శి కొర్ర రామ్ సింగ్ నాయక్, కిన్నెర హరికృష్ణ, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ,పలు గ్రామాల అధ్యక్ష లు ,కార్యదర్శులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ALSO READ : Health News : బిపి పెరుగుతోంది.. ఎంత అనారోగ్యమో తెలుసా.. భారత్ లోనే పెరుగుతున్న బాధితులు..!