నిరుద్యోగ నిరసన ర్యాలీ సభను విజయవంతం చేయాలి – పాల్వాయి స్రవంతి

నిరుద్యోగ నిరసన ర్యాలీ సభను విజయవంతం చేయాలి – పాల్వాయి స్రవంతి

చౌటుప్పల్, మన సాక్షి :

ఈనెల 8న టిపిసిసి ఆధ్వర్యంలో సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్న నిరుద్యోగ నిరసన ర్యాలీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ హాజరవుతున్న సందర్భంగా ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పాల్వాయి స్రవంతి పిలుపునిచ్చారు.

 

చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తొమ్మిది సంవత్సరాల బి.ఆర్.ఎస్ పార్టీ పాలనలో నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదని అన్నారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ, నేడు అప్పుల తెలంగాణ రాష్ట్రంగా మార్చిన ఘనత కేసిఆర్ దే అని అన్నారు. పేపర్ లీకేజీలతో విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

 

త్వరలోనే ఈ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. ఈ నెల 8న చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీకి విద్యార్థులు, నిరుద్యోగులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరారు.

 

ఈ కార్యక్రమంలో టిపిసిసి ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, ఐ ఎన్ టి యు సి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బోయ రామచంద్రం, డి నాగారం మాజీ ఎంపీటీసీ మల్కాపురం నరసింహ, ఐ ఎన్ టి యు సి బ్లాక్ అధ్యక్షుడు సామకూర రాజయ్య, చెరుకు లింగస్వామి ,ఏసుదాస్, దయాకర్ రెడ్డి, వర్కాల రాము ,తూర్పునూరి శ్రీకాంత్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.