ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి..!

ఎల్లారెడ్డి మండలం లోనీ సోమార్పేట్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సాయి ప్రసాద్( 45 ) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు .

ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ మృతి..!

మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన గ్రామస్తులు..!

ఎల్లారెడ్డి , మన సాక్షి:

ఎల్లారెడ్డి మండలం లోనీ సోమార్పేట్ గ్రామానికి చెందిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ సాయి ప్రసాద్( 45 ) అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు .ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గా గ్రామ వాసులకు ఉపాధి హామీ పనులు చూపించడంలో మంచి పేరు సంపాదించాడు .

ALSO READ : మిర్యాలగూడ : 26వ తేదీ వరకు కార్యక్రమాలకు ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ దూరం..!

ఏ ఉపాధి హామీ కూలికి అడిగిన సాయి ప్రసాద్ చాలా మంచి సారు మాకు పని కల్పిస్తాడు అని బాధతో గ్రామస్తులు తెలిపారు. అతని మృతి చెందిన వార్త విన్న గ్రామస్తులు ఒక్కసారిగా చాలా బాధపడ్డట్లు తెలిపారు. అతని దహన సంస్కారాలకు ఊరు ఊరంతా ఒక్కటే అంతిమయాత్రలో పాల్గొన్నారు.

మృతుడు సాయి ప్రసాద్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. ఉన్నారని ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా మృతుడి భార్య పిల్లలకు ఆదుకోవాలని గ్రామస్తులు కోరారు.

ALSO READ : Rythu Bandhu : రైతుబంధు డబ్బులు రాలేదా.. అయితే ఇలా చేయండి..!