జాతీయంBreaking News
NSE: పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు ఎన్ఎస్ఈ ఆర్థిక భరోసా..!

NSE: పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు ఎన్ఎస్ఈ ఆర్థిక భరోసా..!
మనసాక్షి:
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఏప్రిల్ 22, 2025న జరిగిన దారుణమైన ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ ఇండియా (NSE) సంఘీభావం తెలిపింది. ఈ హింసాత్మక చర్యలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు రూ.1 కోటి (ప్రతి కుటుంబానికి సుమారు రూ. 4 లక్షలు) అందజేస్తామని NSE ప్రకటించింది.
ఈ దుఃఖ సమయంలో దేశంతో కలిసి నిలబడుతున్నట్లు NSE వివరించింది. NSE ఎండీ & సీఈఓ అశిష్కుమార్ చౌహాన్ మాట్లాడుతూ.. “ఇది మన దేశానికి శోక సమయం. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాం. వీలైనంత సహాయం అందించాలని ఆశిస్తున్నాం” అని అన్నారు.









