Hyderabad : ప్రజావాణికి హాజరుకాని అధికారులు.. కార్పొరేటర్ ఆగ్రహం..!
Hyderabad : ప్రజావాణికి హాజరుకాని అధికారులు.. కార్పొరేటర్ ఆగ్రహం..!
మేడ్చల్ మల్కాజిగిరి, మనసాక్షి :
ప్రజావాణి లో అధికారులు పాల్గొనక పోవడాన్ని మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. ఉదయం 11 గంటలకు పలువురు కాలనీ వాసులతో సమస్యల పై చర్చించడానికి మున్సిపల్ సర్కిల్ కార్యాలయం లో ప్రజావాణి ఛాంబర్ లో వెళ్లగా అక్కడ ఇంజనీరింగ్, శానిటైజషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు ఎవరు లేకపోవడం తో డిప్యూటీ కమీషనర్ ను నీలాదీశారు.
కార్పొరేటర్ శ్రవణ్ నీలాదీయాడంతో డిప్యూటీ కమీషనర్ రాజు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి పిలిపించినా డి.ఈ మహేష్ రాకపోవడం గమనార్హం. గత ప్రజా వాణి లో జిహెచ్ఎంసి పార్కులా పరిరక్షణ, కాలనీ లేఔట్ ల తయారీ, డబల్ ప్రాపర్టీ నెంబర్ తీసివేత, నాలా ల నిర్మాణం పై ఫిర్యాదులు ఇచ్చినప్పటికి ఎందుకు చెర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు.
టౌన్ ప్లానింగ్ లో చైన్ మెన్ ల రాజ్యం నడుస్తోందని,
అక్రమ నిర్మాణాల తో సిబ్బంది కూముక్కు అవడం వల్లే నాలాలు ప్రభుత్వ స్థలాలు కబ్జా కు గురవుతున్నాయి అని అన్నారు. మెయిన్ రోడ్ల పైన ఆక్సిడెంట్లు కాకుండా రాంబ్లోర్ స్ట్రిప్ ఎందుకు వెయ్యట్లేదని ఘాటుగా ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై చిత్త శుద్ధి తో వ్యవహరించాలని అధికారులకు సూచించారు.
MOST READ :









