సూర్యాపేట : ఒలంపిక్ రన్ గ్రాండ్ సక్సెస్..!

సూర్యాపేట : ఒలంపిక్ రన్ గ్రాండ్ సక్సెస్..!

సూర్యాపేట , మనసాక్షి

ఆటలు ఆరోగ్యానికే కాదు సమాజానికి మేలు చేకూరుస్తాయని నమ్మే నాయకుడు సీఎం కేసీఆర్‌ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ప్రపంచ ఒలింపిక్ రన్ దినోత్సవాన్ని పురస్కరంచుకుని జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రం లో జరిగిన ఒలింపిక్‌ రన్‌ గ్రాండ్ సక్సెస్ అయింది.

 

వందలాది మంది పాల్గొన్న ఒలింపిక్ రన్ ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. కొత్త బస్టాండ్ వద్ద నుంచి ప్రారంభమైన పరుగు ఎం.జీ రోడ్ శంకర్ విలాస్ సెంటర్ మీదుగా టాంక్ బండ్ వరకు 2 కి.మీల మేర సాగింది ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

 

దశాబ్ద కాలం లో క్రీడా రంగం లో స్పష్టమైన మార్పు వచ్చిందని అన్నారు.ఆటలకు అందలమిస్తున్న ప్రభుత్వం దేశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అన్నారు.స్టేడియాలు, క్రీడా ప్రాంగణాల నిర్మాణం అందులో భాగమే అన్నారు.

 

Also Read : Central scheme | ఈ పథకంలో చేరితే.. రైతులకు నెలకు రూ. 3 వేలు..!

క్రీడా అభివృద్ధి లో దేశానికి దిక్సూచి తెలంగాణ అన్నారు.ప్రతి ఒక్కరూ చదువుతో పాటు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల వల్ల దేహదారుడ్యంతో పాటు స్నేహ సంబంధాలుమెరుగుపడతాయన్నారు. చిన్న తనం నుంచే క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని సూచించారు. గ్రామ స్థాయి నుండే వివిధ విభాగాల్లో మంచి ప్రతిభ కనబరచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

 

తెలంగాణలో క్రీడలు సర్వతోముఖాభివృద్ధి సాధిస్తున్నాయన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అభివృద్ధి పథంలో దూసుకెళుతూ దేశానికి దిక్సూచిలా నిలుస్తున్నాయన్నారు.మిగతా రంగాల్లో వలే క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తూ దేశంలో మొదటి స్థానంలో నిలుపాలన్న సీఎం కేసీఆర్‌ ఆలోచనలతో ప్రభుత్వం ముందుకెళుతున్నది అన్నారు.

 

Also Read : RBI : రూ. 30 వేల కంటే ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే.. ఆర్బీఐ క్లారిటీ..!

 

గడిచిన దశాబ్ద కాలంలో రాష్ట్ర క్రీడారంగంలో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నదన్న మంత్రీ,క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు స్టేడియాల నిర్మాణం, గ్రామీణ క్రీడా ప్రాంగణాలను భారీ ఎత్తున ఏర్పాటు చేశాం అన్నారు.

 

కార్యక్రమం లో సూర్యపేట జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ కన్వీనర్ నామ నరసింహ రావు అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల అన్నపూర్ణ, మున్సిపల్ కమిషనర్ రామాంజిరెడ్డి,స్పోర్ట్ ఆఫీసర్ వెంకట్ రెడ్డి, సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్,

 

డి.టి.డి.వో శంకర్, కమిటీ సభ్యులు శ్రీనివాస్, మారిపెద్ది శ్రీనివాస్, నాగిరెడ్డి, లింగయ్య, వీరయ్య,రాంచంచర్ గౌడ్,మల్లేష్,వెంకటేశ్వర్లు ఇతర అధికారులు క్రీడాకారులు అన్ని అసోసియేషన్ సంఘాలు పాల్గొన్నారు.

 

Also Read : PhonePe : ఫోన్ పే గుడ్ న్యూస్.. కొత్త సర్వీసులు, కస్టమర్లకు రూ. 2 లక్షల ఆదా…!