తెలంగాణBreaking Newsహైదరాబాద్

Gold Price : పసిడికి మరోసారి రెక్కలు.. తులం బంగారం ధర ఎంతంటే..!

Gold Price : పసిడికి మరోసారి రెక్కలు.. తులం బంగారం ధర ఎంతంటే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

పసిడి ధరలకు మరోసారి రెక్కలు వచ్చాయి. వరుసగా బంగారం ధరలు పెరుగుతూ పసిడి ప్రియులకు నిరాశను మిగులుచుతుంది. కార్తీక మాసం ప్రారంభంలో శుభకార్యాలు ఉండటం వల్ల వారం రోజులపాటు భారీగా బంగారం ధరలు తగ్గడంతో మహిళలు కొనుగోలు చేశారు.

మరింతగా బంగారం ధర తగ్గుతుందని భావించారు. కానీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. గత నాలుగు రోజులుగా బంగారం ధర చుక్కలు చూపిస్తుంది. రోజురోజుకు పెరుగుతుంది.

గురువారం (Nov -21) ఒక రోజే 24 క్యారెట్స్ బంగారం 100 గ్రాములకు 3300 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్స్ బంగారం కు 3000 రూపాయలు పెరిగింది.

తులం బంగారం (10 గ్రాములు) హైదరాబాదులో ఉన్న ధరల ప్రకారం నవంబర్ 20వ తేదీన 77,620 రూపాయలు ఉండగా నవంబర్ 21వ తేదీన 77, 950 కి చేరింది.

అదేవిధంగా 22 క్యారెట్స్ బంగారం ధర నవంబర్ 20వ తేదీన 71,150 రూపాయలు ఉండగా నవంబర్ 21వ తేదీన (గురువారం) 71,450 రూపాయలకు చేరింది.

MOST READ : 

మరిన్ని వార్తలు