మిర్యాలగూడ : ధాన్యం కాంటాలు వేయాలని కోదాడ – జడ్చర్ల హైవేపై రాస్తారోకో

మిర్యాలగూడ : ధాన్యం కాంటాలు వేయాలని రాస్తారోకో

మిర్యాలగూడ , మనసాక్షి :

నెలల తరబడి ధాన్యం రాశులు ఉన్నా.. కాంటాలు వేయడం లేదని రైతులు కోదాడ – జడ్చర్ల హైవేపై రాస్తారోకో చేసిన సంఘటన మంగళవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడలో చోటుచేసుకుంది. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాస్తారోకోలో పాల్గొన్నారు.

 

మిర్యాలగూడ మార్కెట్ యార్డులో రైతులు నెలల తరబడి ధాన్యం పోసి పడి గాపులు కాస్తున్నారు. రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బిఎల్ఆర్) పాల్గొని మాట్లాడుతూ.. రైతులకు కనీస సౌకర్యాలు కూడా లేవన్నారు. మంచి నీళ్ళు లేకపోవడం అదే విధంగా బస్తాలు లేవు , టార్పలిన్లు లేవు , తెరాస నాయకుల రికమెండేషన్ లలో వారికి అనుకూలమైన వారికి కాoటలు వేస్తూ సిగ్గు మాలిన కార్యక్రమాన్ని పూనుకున్నారని విమర్శించారు.

 

అలగడప సొసైటీ చైర్మన్ తన అనుకూల రైతులకు కాంటాలు వేసి ఇంటికి పంపిస్తున్నాడని, మిగతా రైతులు రోజుల తరబడి ఎండనక , వాననక కళ్ళలో కన్నీరు కారుస్తూ కుటుంబాన్ని వదిలి అక్కడే వుంటున్నారని అన్నారు.

 

ఇదా ఈ పాలకుల పరి పాలన రైతే రాజు అని గొప్పలు చెప్పుకునే పాలకుల్లారా…. ఇక్కడ రైతులు గొసలు పడ్తుంటే గాలికి వదిలేశారని.. రైతుల ఉసురు ఈ కెసిఆర్ ప్రభుత్వం కు మిర్యాలగూడ తెరాస ప్రజాప్రతినిధులకు తగలడం ఖాయం అన్నారు. తక్షణమే రైతుల ధాన్యానికి కాంటలు వేసి ఇంటికి పంపించాలని లేని యెడల ఎమ్మెల్యే ల మంత్రుల కన్వాయిలను అడ్డుకుంటామన్నారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ దనావత్ సిద్దు నాయక్ , మహేందర్ రెడ్డి, జాని నాయక్, తరశింఘ్ నాయక్, నరేష్ తదితరు లు పాల్గొన్నారు.