మిర్యాలగూడ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో రైతుల కష్టాలు

మాజీ ఎమ్మెల్యే,జూలకంటి రంగారెడ్డి

మిర్యాలగూడ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయకపోవడంతో రైతుల కష్టాలు

మాజీ ఎమ్మెల్యే,జూలకంటి రంగారెడ్డి

వేములపల్లి, మన సాక్షి

ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని మంగళవారం నాడు మండలం పరిధి బుగ్గబావిగూడెం గ్రామంలో ఐకేపీ కేంద్రాన్ని రైతు సంఘం జాతీయ నాయకులు, జూలకంటి రంగారెడ్డి పరిశీలించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐకేపీ కేంద్రాల్లోని వరి ధాన్యాన్ని మద్దతు ధరకు వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.నెల 15 రోజుల నుండి ధాన్యం కొనుగోలు చేయకపోవడం వలన ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఎండకు ఎండ,వానకు తడిసిపోవడం వలన రైతులు ఆందోళనకు గురి అవుతున్నారన్నారు.

 

కేంద్రాల్లో టార్బాల్స్,మంచి నీరు,కరెంట్ వంటి సదుపాయాలు కల్పించాలని కోరారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేస్తాం రైతులకు నష్టం కలిగించకుండా చేస్తాం అని చెప్పి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ కొనుగోలు వేగవంతం చేయకపోవడం అని ప్రశ్నించారు.

 

అకాల వర్షాలకు అక్కడక్కడా ధాన్యం తడుస్తుంటే కావున రాష్ట్ర ప్రభుత్వం సంభందిత అధికారులను అప్రమత్తం చేసి యుద్ద ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రైతులతో కలిసి రైతు సంఘం పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

 

ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు,డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రవి నాయక్, మండల వైస్ ఎంపీపీ పాదూరి గోవర్దని తదితరులు పాల్గొన్నారు.