మిర్యాలగూడ : ధాన్యం దిగుమతి ఇంత తక్కువా..?

మిర్యాలగూడ : ధాన్యం దిగుమతి ఇంత తక్కువా..?

మిల్లులను పరిశీలించిన అదనపు కలెక్టర్ భాస్కరరావు

మిర్యాలగూడ, మన సాక్షి :

ప్రతి మిల్లు ప్రతిరోజు 10 లారీలకు తగ్గకుండా దాన్యం దిగుమతి చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కరరావు ఆదేశించారు. సోమవారం మాడ్గులపల్లి మండలంలోని కుక్కడం లో ఉన్న గోదాం, మిర్యాలగూడ శివారులో ఉన్న కనకమహాలక్ష్మి కామధేను మహేశ్వరి రైస్ మిల్లులను ఆయన డీఎస్ఓ వెంకటేశ్వర్లు తో కలిసి సందర్శించి దిగుమతులపై ఆరా తీశారు.

 

ధాన్యం దిగుమతి చాలా తక్కువగా ఉంటుందని అలా కాకుండా మిల్లర్లు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.

ప్రతి చిన్న మిల్లు ప్రతిరోజు 10 నుంచి 15 లారీలు, పెద్ద మిల్లులు 15 నుంచి 20 లారీలు తగ్గకుండా దాన్యం దిగుమతి చేసుకోవాలన్నారు. ధాన్యం దిగుమతిలో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.

 

అలసత్యం వహించకుండా ఎప్పటికప్పుడు ధాన్యం దిగుమతి చేసుకోవాలని కోరారు. ధాన్యం దిగుమతులు మిల్లర్లు సహకరించాలని కోరారు. కొనుగోలు కేంద్రాలలో కాంటావేసిన ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్, వెంకటరమణ చౌదరి, సివిల్ సప్లై డిప్యూటీ తహసిల్దార్ రామకృష్ణారెడ్డి, ఆర్ ఐ సురేందర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు