సూర్యాపేట : ధాన్యాన్ని మిల్లర్లు 24 గంటలలో దిగుమతి చేయాలి

ధాన్యాన్ని మిల్లర్లు 24 గంటలలో దిగుమతి చేయాలి

సూర్యాపేట, మనసాక్షి

రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యాన్ని అదేరోజు రవాణా చేపట్టి మిల్లర్లకు పంపాలని అధికారులకు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ సూర్యాపేట మండలంలోని ఆత్మకూరు యస్, దాచారం, చివ్వేంల మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనకి చేశారు.

 

మొదటగా ఆత్మకూర్ ఎస్ కేంద్రంలో పిఎసిఎస్ కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని కలెక్టర్ స్వయంగా మాచ్యరైజైషన్ మిషన్ ద్వారా తేమ శాతాన్ని పరిశీలించారు. రైతుల ఆధైర్యపడవద్దని ధాన్యానంతటిని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కలెక్టర్ హామీ ఇచ్చారు.

 

రైతులు అదనపు లారీలు కావాలని ధాన్యం రవాణా కొంత ఆలస్యం అవుతుందని తెలుపగా వెంటనే కలెక్టర్ ఆర్ టి ఓ వెంకటరెడ్డి తో ఫోన్లో మాట్లాడి 6 లారీలను వెంటనే ధాన్యం కోనుగోలుగు పంపించాలని ఆదేశించారు.

 

అనంతరం దాచారంలోని ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించి రైతులతో మాట్లాడారు ధాన్యం రవాణా త్వరగా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సేంటర్ ఇన్చార్జిలకు కలెక్టర్ ఆదేశించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ తెలిపారు. చివ్వెంల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం రవాణా సకాలంలో జరిగేలా చూడాలన్నారు,

 

ప్రతి మిల్లు వద్ద ఒక తాసిల్దార్ని నియమించాలని సహాయకుడిగా ఆరైని ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోదాడ ఆర్డిఓ కిషోర్ కుమార్ ని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రాలలో ఉంచరాదని అదే రోజు రవాణా చేపట్టి మిల్లర్లకు తరలించాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టర్ వెంట తాసిల్దార్లు పుష్ప, రంగారావు,ఏఒ దివ్య, ఆశాకుమారి, ఏఈఓ శైలజ సిబ్బంది పాల్గొన్నారు.