Paddy : తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. – జూలకంటి రంగారెడ్డి

తడిసిన ధాన్యాన్ని షరతులు లేకుండా కొనుగోలు చేయాలి. – జూలకంటి రంగారెడ్డి

మాడ్గులపల్లి, మనసాక్షి:

నల్గొండ జిల్లా మాడ్గులపల్లి మండలం లోని పలు గ్రామాల్లో కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పాములపాడు గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శుక్రవారం కురిసిన అకాల వర్షాల వలన రైతుల ధాన్యం పూర్తిగా తడిసింది. కావున తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలి, అలాగే లారీ ల రవాణా సరిగ్గా లేక కూడా రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు.

 

కార్యక్రమంలో cpm పార్టీ జిల్లా కార్యదర్శి ముది రెడ్డి సుధాకర్ రెడ్డి,పార్టీ రాష్ట్ర సభ్యుడు డబ్బికర్ మల్లేశం,వెంకటేశ్వర్లు,మండల కార్యదర్శి శ్రీనివాస్,రైతు సంఘం నాయకులు పాల్వాయి రామ్ రెడ్డి,నాగమ్మ , రవీందర్ రెడ్డి,వెంకట్ రెడ్డి, రామచంద్ర,శ్రీను తదతరులు ఉన్నారు.