Forgery : పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ.. నలుగురి రిమాండ్..!
Forgery : పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ.. నలుగురి రిమాండ్..!
కామారెడ్డి, మన సాక్షి:
కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామపంచాయతీ కార్యదర్శి , సంతకం ఫోర్జరీ చేసిన కేసులో నలుగురిని రిమాండ్ చేసినట్లు ఎస్సై స్రవంతి ఆదివారం తెలిపారు. దోమకొండ మండల కేంద్రనికి చెందిన చింతల రవీందర్, మన్నే శ్యామ్ రెడ్డి అనే ఇద్దరి వద్ద గ్రామపంచాయతీ పేరుతో నకిలీ రసీదు బుక్కులు, స్టాంపు పేపర్లు రబ్బర్ స్టాంపులు కలిగి ఉండి, విక్రయిస్తున్న వాటిని సీజ్ చేసి A1, A2 గా కేసు నమోదు చేశామని దోమకొండ మండల కేంద్రనికి చెందిన, మంగళ పల్లి శ్రావణ్, తన పెద్దమ్మ మంగళ పల్లి రాజమణి యొక్క బంగారాన్ని పంచాయతీ కార్యదర్శి యొక్క నకిలీ స్టాంపులు, పేపర్ లు ఉపయోగించి పంచాయతీ కార్యదర్శి యొక్క సంతకాన్ని ఫోర్జరీ చేసి, ఆమెకు తెలియకుండా. కామారెడ్డి మన పురం బ్యాంకులో గోల్డ్ లోన్ విడిపించి, ఆ బంగారం అతని పేరు మీద మార్పించినoదుకు A3 గా, కామారెడ్డి పట్టణ కేంద్రంలో శ్రీ కృష్ణ రబ్బర్ స్టాంప్ షాప్ యజమాని దోoతుల కృష్ణ నకిలీ స్టాంపులను తయారుచేసి విక్రయించి నందుకు, A4 గా నలుగురు నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేసినట్లు ఎస్సై స్రవంతి తెలిపారు.
దోమకొండ గ్రామపంచాయతీ యొక్క నకిలీ రసీదు బుక్కులు, రబ్బర్ స్టాంపులను నిందితుల వద్ద స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గ్రామంలో ఎవరైతే కోర్టు కేసులలో మరియు పోలీస్ కేసుల విషయంలో జామిని షూరిటీ పత్రాల కోసం తిరుగు తున్నారో వారిని గుర్తించి , వారి అవసరం అదునుగా భావించి వారికి కోర్టు జామిన్ షూరిటీ పత్రాలు సిద్ధం చేసి ఇస్తామని చెప్పి వారి నుంచి అధిక డబ్బులు వసూలు చేసి, ఈ నకిలీ రసీదు బుక్కులను నకిలీ స్టాంపులను ఉపయోగించి మరియు గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకాలను ఫోర్జరీ చేసి వారికి నకిలీ షూరిటీ పత్రాలను తయారు చేసి ఇచ్చే క్రమంలో పట్టుబడ్డారని తెలిపారు.
MOST READ :
-
Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!
-
Mobile : నీ పక్కన ఫోన్ మాట్లాడే వాళ్లు ఎవరితో మాట్లాడుతున్నారో.. తెలుసుకోవాలా, చాలా ఈజీ.. ఇలా చేయండి..!
-
Gold Price : ఒక్కసారిగా రూ.12 వేలు పెరిగిన బంగారం ధర.. తులం ఎంతంటే..!
-
Groups : పేదరికాన్ని జయించిన స్నేహ.. మొదటి ప్రయత్నంలోనే గ్రూప్ -1..!
-
Rythu Bharosa : రైతు భరోసా పై కీలక ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్. !









