పండుగలు కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలి
పండుగలు కుల మతాలకు అతీతంగా జరుపుకోవాలి
సి.ఐ వేణు కుమార్..
హత్నూర, మన సాక్షి:
హత్నూర మండల పరిధిలో దౌల్తాబాద్ శ్రీ బాలాజీ గార్డెన్ లో సి ఐ వేణు కుమార్, స్థానిక ఎస్ ఐ సుభాష్ రానున్న పండుగలు వినాయక చవితి, మిలాద్ ఉన్ నబీ దృష్టిలో పెట్టుకొని పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలోని వివిధ మతాల పెద్దలు, కుల సంఘాల సభ్యులతో పీస్ కమిటీ మీటింగ్ శనివారం ఏర్పాటు చేశారు.
ఈసందర్భంగా ప్రతి ఒకరు ప్రతి పండగను కుల మతాలకు అతీతంగా స్నేహపూర్వకంగా పండగ వేడుకలు జరుపుకోవలన్నారు. ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఏమైనా ర్యాలీలు తీసిన శాంతియుతంగా జరుపుకోవాలని , జరిపిన ముందుగా పోలీస్ లకు సమాచారం ఇవ్వాలని పోలీసుల విధులకు సహకరించాలన్నారు.
అంతేకాకుండా గణేష్ ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల దగ్గర తీసుకోవలసిన జాగ్రత్తలు :
నిమర్జనం చేసే జాగ్రత్తలు గణేష్ మండపం పెట్టేటప్పుడు రోడ్డుకు అడ్డంగా ప్రయాణికులకు , చుట్టుప్రక్కల వారికి ఇబ్బంది కలువకూడదు
ALSO READ :
1. మిర్యాలగూడ : మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. తప్పిన ప్రమాదం..!
2. Nalgonda : నల్గొండలో ఆత్మహత్యయత్నానికి పాల్పడిన విద్యార్థినిలు మృతి.. మరో యువకుడు కూడా ఆత్మహత్య..!
3. సూర్యాపేట : ఘోర రోడ్డు ప్రమాదం.. ఉపాధ్యాయురాలు మృతి, ఆమె భర్త కు తీవ్ర గాయాలు..!
ప్రజల నుంచి ఇబ్బంది చేస్తూ చందాలు వసూలు చేయకూడదు, కరెంటుకు సంబంధించిన పర్మిషన్, తగు జాగ్రత్తలు తీసుకోవాలి
చుట్టుపక్కల వారికి ప్రజలకు ఇబ్బంది కలిగినట్టు పాటలు పెట్టకూడదు, భజన పాటలు పెట్టాలి, వేరే కులాలకు రెచ్చగొట్టే పాటలు వాక్యాలు అసలీలమైన పాటలు పెట్టరాదు.
విగ్రహం పెట్టిన చోట జూదం, మట్కా, మద్యం సేవించడం, ఆటలు ఆడటం చేయకూడదు, ఒకవేళ చేసినచో చర్యలు తప్పవు.
నిమజ్జనం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ సీరియల్ నెంబర్ పాటించాలి, మద్యం సేవించి నిమజ్జనం చేయవద్దు, డిజె సౌండ్ అనుమతించబడదు.
నిమజ్జనం చేసే దగ్గర లైట్లు పెట్టుకోవాలి, ఈత వచ్చిన వాళ్లే నిమజ్జనం చేయాలి, అందరూ ఒకటే రోజు నిమజ్జనం చేయాలి అని సిఐ వివరించారు.
ఈ కార్యక్రమంలో స్టేషన్ సిబ్బంది, కుల సంఘాల సభ్యులు పాల్గొన్నారు.









