శ్రీరామ్ సాగర్ నీళ్లు రాక ఎండిపోతున్న వరి పొలాలు

శ్రీరామ్ సాగర్ జలాలు పెన్ పహాడ్ మండలంలోని కొన్ని గ్రామాలకు రాక పచ్చని పొలాలు ఎండిపోతున్నాయి. మండల పరిధిలోని గాజుల మల్కాపురం, చీదెళ్ళ, ముకుందాపురం, న్యూ బంజర హిల్స్, ధూపహాడ్ గ్రామాలలో పొట్ట దిశకు వచ్చిన వరి పొలాలు ఎండిపోతున్నాయి.

శ్రీరామ్ సాగర్ నీళ్లు రాక ఎండిపోతున్న వరి పొలాలు

పెన్ పహాడ్,మన సాక్షి:

శ్రీరామ్ సాగర్ జలాలు పెన్ పహాడ్ మండలంలోని కొన్ని గ్రామాలకు రాక పచ్చని పొలాలు ఎండిపోతున్నాయి. మండల పరిధిలోని గాజుల మల్కాపురం, చీదెళ్ళ, ముకుందాపురం, న్యూ బంజర హిల్స్, ధూపహాడ్ గ్రామాలలో పొట్ట దిశకు వచ్చిన వరి పొలాలు ఎండిపోతున్నాయి.

శ్రీరామ్ సాగర్ కాల్వ పై లస్కర్లు లేక ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు కాలువలకు అడ్డుకట్టలు వేసి చివరలో ఉన్న రైతులకు నీరు పోనివ్వకపోవడంతో పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు శ్రీరాంసాగర్ కాల్వపై లస్కర్లను ఏర్పాటు చేసి అన్ని గ్రామాల రైతులకు కాలేశ్వరం జలాలు అందే విధంగా అధికారులు చూడాలని రైతు సోదరులు కోరుతున్నారు.

పొట్ట దిశలో ఎండిపోతున్న పొలాలకు ప్రభుత్వం వారు రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వివిధ గ్రామాల రైతులు కోరుతున్నారు.

ALSO READ : KTR : మన కేటీఆర్ ఇలా అయ్యాడా.. ఏంటో ఆ కథ తెలుసుకోండి.. నెట్టింట్లో వైరల్..!