సమ్మె విరమించిన పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు.. యధావిధిగా పెట్రోల్ ట్యాంకర్లు..!

మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్ , ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె చేపట్టారు. దాంతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద వాహనాదారులు భారీగా క్యూ కట్టారు.

సమ్మె విరమించిన పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు.. యధావిధిగా పెట్రోల్ ట్యాంకర్లు..!

హైదరాబాద్, మన సాక్షి :

మోటారు వాహనాల చట్టం సవరణను నిరసిస్తూ తెలంగాణలో పెట్రోల్ , ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె చేపట్టారు. దాంతో పెట్రోల్ డీజిల్ సరఫరా నిలిచిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పెట్రోల్ బంకుల వద్ద వాహనాదారులు భారీగా క్యూ కట్టారు.

అనేక చోట్ల పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు కూడా పెట్టారు. కొన్నిచోట్ల వాహనదారులను అదుపు చేసేందుకు పోలీసులు సైతం రంగంలోకి దిగారు.

అదేవిధంగా పెట్రోల్ డీజిల్ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గిస్తుందనే భావనలో ఉన్న కొందరు బంకుల నిర్వాహకులు ఫుల్ స్టాక్ కూడా చేయించుకోలేదు. దాంతో అతి త్వరగా పెట్రోల్ డీజిల్ అయిపోవడంతో నో స్టాక్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

ALSO READ : Upi Rules : ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు అలర్ట్.. కొత్త సంవత్సరం నుంచి మారిన రూల్స్ .. చూడండి..!

ఇది ఇలా ఉండగా పెట్రోల్ ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. దాంతో ట్యాంకర్లు యధావిధిగా నడుస్తున్నాయి. మంగళవారం ఉదయం నుంచి ధర్నాకు దిగడంతో వాహనదారులు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది.

సమ్మె విరమించడంతో హైదరాబాద్ నగరంలో పలుచోట్ల యధావిధిగా పెట్రోల్ కొనసాగుతుంది. హైదరాబాదులోని బంకుల వద్ద భారీ క్యూ ఉండడంతో ఖైరతాబాద్ – లకిడికాపూల్ – మెహదీపట్నం మార్గాలలో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.

ALSO READ : Telangana : మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణంలో కీలక మార్పులు.. 2024 జనవరి 1 నుంచి ఆ స్కీమ్స్ ఉపసంహరణ..!