పిల్లలమర్రి లో భక్తులతో పోటెత్తిన శివాలయాలు..!

పిల్లల మర్రి లోని రెండు శివాలయంలోని శివలింగాలకు తెల్లవారు జామున రుద్రాభిషేకం నిర్వహిచారు.

పిల్లలమర్రి లో భక్తులతో పోటెత్తిన శివాలయాలు..!

భక్తులకు ఏర్పాట్లు చేయడంలో విఫలం

పరమ శివుని దయతో సుఖసంతోషాలతో ఉండాలని వేడుకొలు

సూర్యాపేట, మనసాక్షి :

సృష్టి లయ కారకుడైన పరమేశ్వరుని ప్రీతి కరమైన మహా శివరాత్రి వేడుకలు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు తెల్లవారు జామునుండే పలు శివాలయంలు భక్తులతో పోటెత్తి శివ నామ స్మరణ తొ మారుమోగాయు . జిల్లా కేంద్రంలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం, పాత శివాలయం, శ్రీ సంతోషిమాత దేవాలయం, కుసుమ వారి గూడెం లోని శివాలయం, పిల్లల మర్రి లోని రెండు శివాలయంలోని శివలింగాలకు తెల్లవారు జామున రుద్రాభిషేకం నిర్వహిచారు. అనంతరం శివలింగం ను ప్రత్యేకంగా అలంకరణ చేసి దూప దీప నైవేద్యం సమర్పించారు. అనంతరం భక్తులు దర్శనం చేయనుకున్నారు.

పిల్లమర్రి దేవాలయం లో దర్శనం ఏర్పాట్లు చేయడంలో విఫలం : 

ఎంతో ప్రచుర్యం సంతరించుకున్న పిల్లలమర్రి దేవాలయం లో ఏర్పాట్లు చేయడంలో పాలకమండలి సభ్యులు, అధికారులు పూర్తిగా విఫలం చెందారు. ఎర్రకేశ్వరస్వామి దేవాలయం లోని మూడు ద్వారాల ద్వారా దర్శనం నకు భక్తులను పంపడం తొ దర్శనం చేసుకున్న భక్తులు బయటకు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడ్డారు.

గర్భగుడి దర్శనం కొరకు అందరిని పంపడం తొ సాధారణ దర్శనం కోసం వచ్చిన భక్తులు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడి తోపులాడుతూ చాలా ఇబ్బందులు పడ్డారు. భారీకేడ్లు ఏర్పాటు చేసి క్రమంపద్దతిలో దర్శనంనకు పంపాల్సిన, పాలకమండలి సభ్యులు, ఏ దిశ గా సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు వాపోయారు.

ALSO READ : MallaReddy : కెసిఆర్ నుంచి మల్లారెడ్డికి కబురు.. భేటీ అయిన మల్లారెడ్డి..!