వివాదంలో పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు

వివాదంలో పినపాక టీఆర్ఎస్ ఎమ్మెల్యే

రేగా కాంతారావు

పినపాక, ఆగస్టు4, మనసాక్షి : జాతీయ జెండాను అవమానించారని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు పై తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జాతీయ జెండాలోని తెలుపు రంగు స్థానంలో టీఆర్ఎస్ పార్టీని సూచించేలా గులాబీ రంగు పెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా రేగా కాంతారావు ఫోటోతో కలిగిన బ్యానర్లను ఆయన అనుచరులు ఏర్పాటు చేశారు.

ALSO READ :నేరేడుగొమ్ము కస్తూర్భాగాంధీ పాఠశాలలో కరోనా కలకలం – Latest news

అయితే ఇందులో జాతీయ జెండాలోని తెలుపు రంగు స్థానంలో గులాబీ రంగును పెట్టారు. ఈ బ్యానర్లకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వివాదం మొదలైంది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న రేగా కాంతారావు ఫోటోతో ఉన్న బ్యానర్ జాతీయ జెండా రంగును తమ పార్టీని సూచించేలా గులాబీ కలర్ వేయడంపై యువత విరుచుకుపడుతున్నారు.ఆయన అనుచరులు చూపిన అత్యుత్సాహంతో రేగా చిక్కుల్లో పడ్డారు.జాతీయ జెండాను అవమాన పరిచిన రేగా అనుచరులకు దేశం పట్ల ,దేశ ప్రజల పట్ల,జాతీయ గీతం మీద మరియు జాతీయ జెండా మీద ఏ మాత్రం గౌరవం ఉన్న రేగా కాంతారావు కలుగచేసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి.బాధ్యత గల ఎమ్మెల్యే పదవిలో ఉండి దేశాన్ని అవమానించే ఇలాంటి సైన్యాన్ని పెంచి పోసిస్తున్న రేగా కాంతారావు తక్షణమే రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీ నాయకులు, నియోజకవర్గ యువత హెచ్చరిస్తున్నారు.