కాలువ కట్టల పై గస్తీ.. పోలీసులు, ఇరిగేషన్ సిబ్బంది జాయింట్ ఆపరేషన్..!

ఖమ్మం నగర ప్రజలకు తాగునీటి కోసం సాగర్ జలాలను విడుదల చేయటంతో వాటిని చోరీ చేయకుండా పోలీసులు, ఇరిగేషన్ అధికారులు గస్తీ కాస్తున్నారు.

కాలువ కట్టల పై గస్తీ.. పోలీసులు, ఇరిగేషన్ సిబ్బంది జాయింట్ ఆపరేషన్..!

నేలకొండపల్లి, మన సాక్షి :

ఖమ్మం నగర ప్రజలకు తాగునీటి కోసం సాగర్ జలాలను విడుదల చేయటంతో వాటిని చోరీ చేయకుండా పోలీసులు, ఇరిగేషన్ అధికారులు గస్తీ కాస్తున్నారు. సాగర్ జలాలు పాలేరు రిజర్వాయర్ నుంచి ఖమ్మం కు సాగర్ కెనాల్ నుంచి నీటి సరఫరా చేస్తున్నారు.

కాగా నేలకొండపల్లి మండలం లోని రాజేశ్వరపురం వద్ద నున్న నందిగామ బ్రాంచి కెనాల్ వద్ద ఉన్న లాక్ ల వద్ద పోలీసులు. ఇరిగేషన్ సిబ్బంది రాత్రింబవళ్లు పహారా కాస్తున్నారు. రాత్రి వేళలలో నేలకొండపల్లి ఎస్సై తోట నాగరాజు సిబ్బంది తో కాలువ కట్ట పై పెట్రోలింగ్ నిర్వహించారు.

అదే విధంగా ఇరిగేషన్ సిబ్బంది. లష్కర్స్ రాత్రి వేళలలో కాలువ కట్టల పై పడుకుని -కాపాలా కాస్తున్నారు. నందిగామ బ్రాంచి కెనాల్ పరిధిలోని పంటలు నీళ్లు లేక నె రలు చాచటంతో రైతులు ఆందోళన లు చేపటటంతో రైతులులాక్లు ఎత్తుతారని ముందస్తుగా లాక్ల వద్ద గస్తీ పెంచారు.

ALSO READ : BRS, BSP : తెలంగాణలో బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తుపై మాయావతి సంచలన ప్రకటన.. ఆర్ఎస్పి ట్వీట్..!