శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగీలం దియా

ఎనిమిది నెలల పాటు , ఐ ఐ టి ఏ మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం దియా ను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించడం జరిగింది.

శిక్షణ పూర్తి చేసుకున్న పోలీస్ జాగీలం దియా

అభినందించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్

భద్రాది కొత్తగూడెం, మనసాక్షి:

ఎనిమిది నెలల పాటు , ఐ ఐ టి ఏ మొయినాబాద్ నందు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని జిల్లాకు కేటాయించబడిన పోలీస్ జాగీలం దియా ను ఈ రోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపిఎస్ తన కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. ప్రేలుడు పదార్థాలను కనుగొనడంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన దియా జిల్లా పోలీస్ శాఖలో సేవలందించేందుకు రావడం సంతోషకరమని అన్నారు.

పోలీస్ జాగీలం దియా కు హ్యాండ్లర్ గా వ్యవహారిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ మహేందర్ మరియు ఇతర డాగ్ స్క్వాడ్ అధికారులు, సిబ్బందికి ఈ సందర్బంగా ఎస్పీ పలు సూచనలు చేశారు. ప్రస్తుతం జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న 11 పోలీస్ జాగిలాలకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జాగిలాల సంరక్షణ, వసతి ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ విజయ్ బాబు, అడ్మిన్ ఆర్ఐ రవి, ఎంటిఓ సుధాకర్, వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు, హోమ్గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు మరియు తదితరులు పాల్గొన్నారు.