Nalgonda : నల్గొండలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. భారీగా కేసులు నమోదు, వాహనాలు సీజ్..!
Nalgonda : నల్గొండలో పోలీసుల స్పెషల్ డ్రైవ్.. భారీగా కేసులు నమోదు, వాహనాలు సీజ్..!
నల్లగొండ, మన సాక్షి :
నల్గొండ జిల్లా ఎస్. పి శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, నల్గొండ డి. ఎస్. పి కె శివరామ్ రెడ్డి సూచనల మేరకు రాత్రి నల్గొండ వన్ టౌన్ టూ పోలీస్ స్టేషన్ పరిధిలో నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి , నల్గొండ టూ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ డానియేల్ ఆధ్వర్యంలో నల్గొండ వన్ టౌన్ టూ టౌన్ ఎస్ఐ లు, సిబ్బంది జిల్లా స్పెషల్ పార్టీ సిబ్బంది అంతా టీంలు గా ఏర్పడి నల్గొండ వన్ టౌన్, టూ టౌన్ స్టేషన్ పరిధిలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న వ్యక్తులని పట్టుబడి చేసి వారిపై పెట్టి కేసులు నమోదు చేయడం జరిగినది.
అదేవిధంగా, తాగి వాహనాలు నడుపుతున్న వారిని పట్టుబడి చేసి వారిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగినది, తదుపరి, నెంబర్ ప్లేట్లు లేకుండా, వాహణాలకి సరైన పత్రాలు లేకుండా ఉన్న వారిని పట్టుబడి చేసి వాటిని సీజ్ చేయడం జరిగినది. ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం గా 29 ఈ పెట్టి కేసులు, 16 డ్రంకెన్ డ్రైవ్ కేసులు సరైన పత్రాలు లేని 14 వాహనాలు సీజ్ చేసి కేసులు నమోదు చేయడం జరిగినది.
MOST READ :
-
Viral Video : బాలయ్య బాబు స్టెప్పులకు టీచర్ ఫిజిక్స్ పాఠాలు.. ఇలా కూడా చెప్పొచ్చు (వీడియో)
-
Gold Price : ట్రంప్ గెలుపు.. భారీగా పతనమైన పసిడి.. ఒకే రోజు రూ.17,900 తగ్గిన ధర..!
-
Gold Price : పసిడి పండింది.. మొదటి షాక్, 2024 నవంబర్ 6న బంగారం ధర..!
-
Devarakonda : హత్య చేశారు ఆత్మహత్యగా చిత్రీకరించారు.. జాతీయ రహదారిపై మృతుడి బంధువుల ధర్నా..!









