Police Station : పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు..!
పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించి నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..

Police Station : పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు.. నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలు..!
మన సాక్షి, వెబ్ డెస్క్:
పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించి నలుగురు పోలీసులకు తీవ్ర గాయాలైన సంఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో మంగళవారం ఉదయం ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. బయట నుంచి స్వాధీనం చేసుకున్న బాణాసంచా వస్తువులను పరిశీలన కోసం స్టేషన్ లోకి తీసుకొచ్చిన సమయంలో ఈ పేలుడు జరిగినట్లు తెలుస్తుంది. ఈ పేలుడు దాటికి పోలీస్ స్టేషన్ ఆవరణ ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. స్టేషన్ లోపల ఉన్న ఫర్నిచర్ కూడా ధ్వంసం అయ్యాయి.
బయట ఉంచిన వాహనాలు సైతం ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. ఈ సంఘటనతో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్నవారు కూడా వచ్చే వెంటనే సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారిలో ఎస్సై తో పాటు పోలీసు వాహన డ్రైవర్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. గాయపడిన పోలీసులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. చల్లపల్లి సిఐ కెఎస్ రావు ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. మందు గుండు సామాగ్రి పోలీస్ స్టేషన్ కి ఎందుకు తీసుకొచ్చారు..? అందుకు గల కారణాలు ఏంటి..? అనే కోణంలో అధికారులు విచారణ చేపడుతున్నారు.







