కూలిన ప్రగతి భవన్ గేట్లు.. తొలగించిన ముళ్ళ కంచె..!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఓపక్క ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుండగానే మరోపక్క ప్రగతి భవన్ గేట్లు, ముళ్లకంచెను పోలీసులు తొలగించారు. పకడ్బందీగా ఏర్పాటు చేసిన ముళ్లకంచెను యంత్రాల సహాయంతో అధికారులు, పోలీసులు తొలగించారు.

కూలిన ప్రగతి భవన్ గేట్లు.. తొలగించిన ముళ్ళ కంచె..!

హైదరాబాద్ , మన సాక్షి :

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఓపక్క ప్రమాణ స్వీకార మహోత్సవం జరుగుతుండగానే మరోపక్క ప్రగతి భవన్ గేట్లు, ముళ్లకంచెను పోలీసులు తొలగించారు. పకడ్బందీగా ఏర్పాటు చేసిన ముళ్లకంచెను యంత్రాల సహాయంతో అధికారులు, పోలీసులు తొలగించారు.

SLSO READ : ఆరు గ్యారెంటీలపై రేవంత్ తొలి సంతకం.. మాట నిలుపుకొని దివ్యాంగురాలుకు ఉద్యోగం..!

ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఉన్న సమయంలో ప్రగతి భవన్ నిర్మించి లోపలికి అనుమతి లేకుండా రావద్దని ఆంక్షలు విధించారు. అంతేకాకుండా ప్రగతి భవన్ లో అడుగుపెట్టేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు, సైతం వెనుకడుగు వేసే వారని విమర్శలు వినవచ్చాయి .

సామాన్య ప్రజలు కనీసం ప్రగతి భవన్ గేటు కూడా తాకే పరిస్థితి లేదని విమర్శలు వచ్చాయి. దాంతో రేవంత్ రెడ్డి ఎన్నికల ముందే వాగ్దానం చేశారు. ప్రగతి భవన్ కాదని అది ప్రజా భవన్ అని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజా భవన్ గా చేస్తామన్నారు. ముళ్లకంచెలు తొలగిస్తామని హామీ ఇచ్చారు.

ALSO READ : Telangana : తెలంగాణ సీఎం గా రేవంత్.. మంత్రుల ప్రమాణ స్వీకారం..!

ఈ మేరకు ఆయన ప్రమాణస్వీకారం మహోత్సవం జరుగుతుండగానే ప్రగతి భవన్ కున్న గేట్లు ముల్లకంచెను అధికారులు పూర్తిగా తొలగించారు. ప్రగతి భవన్ ముల్లకంచెలను తొలగించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది.

ALSO READ : Free Travel : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఏర్పాట్లు.. ఇవి రూల్స్..!