TOP STORIESBreaking Newsతెలంగాణరాజకీయం

TG News : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ఇవే..!

TG News : తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు ఇవే..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ మంత్రివర్గంలో మరో ముగ్గురు కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆదివారం గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. కొత్త మంత్రులకు పోర్టు పోలియో కేటాయించలేదు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ప్రధానమైన హోం శాఖ, విద్యాశాఖ తోపాటు పలు శాఖలు ఉన్నాయి. కాగా రేవంత్ రెడ్డి అధిష్టానంతో చర్చించిన తర్వాత వీరికి శాఖలు కేటాయించే అవకాశం ఉంది.

కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన గడ్డం వివేక్ కు కార్మిక శాఖతోపాటు మైనింగ్, క్రీడల శాఖను కేటాయించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అడ్లూరి లక్ష్మణ్ కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ ఖరారైనట్లు తెలుస్తోంది. అదేవిధంగా వాకిటి శ్రీహరికి యువజన, పశుసంవర్ధక, మత్స్య శాఖను కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా ముగ్గురు మాత్రులకు పోర్టు పోలియో కేటాయించిన తర్వాత మంత్రివర్గంలో కూడా మార్పులు జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. హోం శాఖను సీతక్కకు కేటాయించనున్నారని సమాచారం.

MOST READ : 

  1. TG News : సీతక్కకు ప్రమోషన్..!

  2. TG News : తెలంగాణ క్యాబినెట్ లోకి ముగ్గురే.. వారు వేరే..!

  3. New Scheme : మహిళలకు తీపి కబురు.. వారికోసం మరో కొత్త పథకం..!

  4. Rythu Bharosa : రైతు భరోసా పై కీలక అప్డేట్.. మంత్రివర్గంలో ఏం చర్చించారు.. తుమ్మల క్లారిటీ..!

  5. TG News : తెలంగాణ ప్రభుత్వం మహిళలకు భారీ శుభవార్త.. వారికి రూ.10 లక్షలు..!

మరిన్ని వార్తలు