Paddy : అధిక వర్షపాతం, ఉక్కపోత వాతావరణంలో వరి పంటను కాపాడుకోండి ఇలా.. శాస్త్రవేత్తల సూచనలు..!
Paddy : అధిక వర్షపాతం, ఉక్కపోత వాతావరణంలో వరి పంటను కాపాడుకోండి ఇలా.. శాస్త్రవేత్తల సూచనలు..!
ముదిగొండ, మన సాక్షి :
ఖమ్మం జిల్లా ముదిగొండ మండల పరిధిలోని మాదాపురం గ్రామంలో కృషి విజ్ఞాన కేంద్రం వైరా ప్రోగ్రాం కోఆర్డినేటర్ డా. కే.రవికుమార్,శాస్త్రవేత్త పి ఎస్ ఎమ్ ఫనీశ్రీ , ముదిగొండ మండల వ్యవసాయ అధికారి సరిత ముదిగొండ మండలంలోని మాదాపురం గ్రామంలో వరి పంటను సందర్శించి రైతులకు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు.
వరి:
చాలా పొలాల్లో బ్యాక్టీరియా ఎండాకు తెగులు ఆశిస్తున్నట్లు గమనించడం జరిగింది. ఈ తెగులు లక్షణాలు గమనించిన వెంటనే పైపాటుగా నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలి.
ఈ తెగులు పూర్తిగా నివారించడానికి ఎలాంటి మందులు లేవు అని రైతులు గమనించాలి అని నిరూపించారు.
ఈ తెగులు లక్షణాలు తొలిదశలో గమనించినట్లైతే కొంతవరకు వ్యాప్తిని నివారించడానికి ప్లాంటమైసిన్ లేదా పోషమైసిన్ 0.2 గ్రా లేదా అగ్రీమైసిన్ 0.4 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
అలాగే వరి పంట పూతదశలో ఉన్నప్పుడు కాపర్ శిలీంధ్రనాశినులను పిచికారి చేయరాదు.
ముఖ్యంగా ఈ తెగులు సమగ్ర యాజమాన్య చర్యలలో భాగంగా ఆఖరి దఫాగా పొటాష్ ఎరువును (15-20 కిలోలు/ ఎకరానికి) వర్షాలు తగ్గిన తర్వాత వేయాలి.
తాత్కాలికంగా నత్రజని సంబంధిత ఏరువులను వేయడం ఆపాలి. పొలంలో పాత నీరు తీసి కొత్తనీరు పెట్టడం చేపట్టాలి. అలాగే వరిలో సుడిదోమ ఆశిస్తున్నట్లు గమనించడం జరిగింది.
విస్తారంగా వర్షాలు కురిసి మరియు గాలిలో అధిక తేమ శాతం, ఉక్కపోత వాతావరణం ఉండటం లాంటి పరిస్థితులలో సుడిదోమ ఉదృతిని గమనించడం జరిగింది.
చివరి దఫా నత్రజని ఎరువులు వేసే రైతులు సుడిదోమ ఉధృతిని బట్టి నత్రజనిని 20-25 కిలోలు మించి వేయరాదు.
దోమ ఉధృతిని బట్టి పొలాన్ని అడపా దడపా అరగట్టాలి. ఈ పురుగు పిల్ల దశలో (తెల్లని దోమలు మొక్కల మొదళ్ళ వద్ద) గమనిస్తే బ్యుప్రోఫెజిన్ 1.6 మి.లీ. లేదా ఎసిఫేట్ + ఇమిడాక్లోప్రిడ్ మిశ్రమ మందు 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పిల్ల మరియు పెద్ద పురుగులు కలిపి దుబ్బుకి 20-25 దోమలు ఉన్న దశలో డైనోటెఫ్యూరాన్ 0.4గ్రా లేదా పైమెట్రోజైన్ 0.6గ్రా. లేదా ట్రైఫ్లూమెజోఫైరిమ్ 0.485 మి.లీ. లేదా ఎథిప్రోల్ + ఇమిడాక్లోప్రిడ్ 0.25 గ్రా. ఒక లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
పొలంలో నీటిని తగ్గించి పాయలు తీసి మొక్కల మొదళ్ళు తడిచేలా పిచికారి చేస్తే దోమ ఉధృతి బాగా తగ్గుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అవగాహన అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Viral Video : ప్రీవెడ్డింగ్ షూట్ లోనే అలా.. ఇదేం ఆత్రం రా నాయన.. (వీడియో)
-
ఆ ప్రియురాలుకు ప్రియుడంటే పిచ్చి ప్రేమ.. అదే ఆ గ్రామస్తులకు రాత్రంతా నిద్ర లేకుండా చేసింది..!
-
Viral Video : అయ్య బాబోయ్.. ఎంత అదృష్టవంతురాలో ఆమె.. (వీడియో)
-
Viral Video : ఏం.. టీచరమ్మ రా బాబు.. క్లాస్ రూమ్ లోనే పిల్లలతో.. (వీడియో)









