రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి – రేవంత్ రెడ్డి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

రాహుల్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలి

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి

హైదరాబాద్, మనసాక్షి : రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టాలని టిపిసిసి సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది . బుధవారం
నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్ లో టీపీసీసీ నూతన ప్రతినిధుల సమావేశం జరిగింది. రాహుల్ గాంధీ ఏకగ్రీవంగా ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టగా సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

దేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి రాహుల్ పాదయాత్ర చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం దేశం సంక్షోభ పరిస్థితుల్లో ఉందన్నారు. ఈ సంక్షోభ సమయంలో దేశాన్ని కాపాడేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉత్తంకుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, హనుమంతరావు తదితరులు ఉన్నారు.