నీట మునిగిన గుడిసెలు

నీట మునిగిన గుడిసెలు
చర్ల,మనసాక్షి:
గత నాలుగైదు రోజులుగా కురుస్తున్న అత్యంత భయంకరమైన వానల కారణంగా చర్ల మండలం కత్తిగూడెం గ్రామస్తులు గత కొంత కాలంగా ఊరి చివారిలో నివసిస్తున్న సుమారు 50 గుడిసెలు మొత్తం నీటమునిగడం తో అక్కడ నివసిస్తున్న గ్రామస్తులంతా కలిసి ముక్కా, ముతకా పిల్ల జెల్లలతో కట్టుబట్టలతో రోడ్డునపడ్డారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కట్టుకునే బట్టలు దగ్గరనుంచి పప్పు ఉప్పలదాకా నిత్యవసర వస్తువులు మొత్తం సైతం తడిసి ముద్దగా మరిపోయాయని కప్పుకునే దుప్పట్లు, మంచాలు, మొత్తం సర్వనాశనం అయ్యాయని,ఇంట్లో ఉన్న బిందెలు, బకెట్లు, తదితర భోజన సామగ్రి మొత్తం వాటర్ లో కొట్టుకు పోయాయని మమ్ములను ఆదుకునే నాధుడే లేడా అంటూ అక్కడి గ్రామస్తులంతా ఆవేద చెందారు. మా ఈ సమస్యకు అధికారులు స్పందించాలంటూ అక్కడి ప్రజలు వేడుకుంటున్నారు.
ALSO READ :
- Atm Card : ఏటీఎం కార్డు వినియోగదారులకు ఆర్బీఐ కొత్త రూల్స్.. మారిన నిబంధనలు..!
- Telangana : సారూ.. ఏవీ..? ఆ.. రూ.10 వేలు..?
- Rain : తెలంగాణలో మూడు రోజులు అతి భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే..!