రాజస్థాన్ టు హైదరాబాద్.. ఘట్కేసర్ లో అడ్డా..!
రాజస్థాన్ టు హైదరాబాద్.. ఘట్కేసర్ లో అడ్డా..!
శేరిలింగంపల్లి, మన సాక్షి :
రాజస్థాన్ నుంచి హైదరాబాద్ కు డ్రగ్స్ రవాణా చేస్తూ ఓ గ్యాంగ్ పట్టుబడింది. రాజస్థాన్ లో తీసుకొని హైదరాబాద్ ఘట్కేసర్ లో అడ్డాగా వాడుకుంటున్నారు. ఆ గ్యాంగ్ వివరాల ప్రకారం..
నగరంలో డ్రగ్స్ దందా చేస్తున్న రాజస్థానీ గ్యాంగును శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈమేరకు రోజుల క్రితం పట్టుబడిన డ్రగ్స్ కేసు వివరాలను శుక్రవారం మాదాపూర్ డీసీపీ వినీత్, ఏడీసీపీ జయరాం ఇతర పోలీసు అధికారులతో కలిసి మీడియాకు వెల్లడించారు.
గచ్చిబౌలిలో తనిఖీలు చేస్తుండగా డ్రగ్స్ తరలిస్తున్న స్మగ్లర్లు పట్టుబడ్డారని చెప్పారు. నిందితుల దగ్గర 620 గ్రాముల హెరాయిన్ దొరికిందని పేర్కొన్నారు. పట్టుబడ్డ హెరాయిన్ విలువ మార్కెట్లో రూ.4.34 కోట్లు ఉంటుందని వివరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన నలుగురు పెడ్లర్స్ సవర్ జాత్, రాజేష్ అనే వ్యక్తితో పాటు దినేష్, గణేష్ రాజస్థాన్ నుంచి డ్రగ్స్ తీసుకువచ్చారు.
ఇక్కడ ఘట్కేసర్ కు చెందిన మంగల్ రాము అనే వ్యక్తి ఇంట్లో పెట్టారు. అక్కడి నుంచి మరికొందరి సహాయంతో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని టెలికాం నగర్ లోగల ప్రకాష్ చౌదరి కి చెందిన లైట్ హౌస్ షాపులో ఈ లిక్విడ్ హెరాయిన్ పెడుతుండగా దాడి చేసి పోలీసులు పట్టుకున్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు టాస్క్ ఫోర్స్, ఎస్ వోటీ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు.
బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్టులతో పాటు ప్రధాన కూడళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. వాహనాలను, అనుమానితులను ఆపి తనిఖీ చేస్తున్నారు. ఇందులో నలుగురు రాజస్థాన్ కు చెందిన వారని తెలిపారు.
ALSO READ :
ఎండలు, ఉక్కపోత ఎందుకో తెలుసా.. వాతావరణశాఖ బిగ్ అప్డేట్..!
Rythu : రైతులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో గుడ్ న్యూస్.. గాంధీ జయంతి నుంచి అమలు..!
Cm Revanth Reddy : మీకు రుణమాఫీ కాలేదా.. ఐతే రేవంత్ శుభవార్త..!









