మిర్యాలగూడ : ఘనంగా రాజీవ్ వర్ధంతి

మిర్యాలగూడ : ఘనంగా రాజీవ్ వర్ధంతి

మిర్యాలగూడ, మన సాక్షి :
మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 32వ వర్ధంతిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నూకల వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిసిసి అధ్యక్షులు శంకర్ నాయక్ ,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ భత్తల లక్ష్మారెడ్డి , పిసిసి మెంబర్ చిర్రుమర్రి కృష్ణయ్య పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ చిన్న వయసులోనే ప్రధానమంత్రి పదవి చేపట్టి భారతదేశానికి ఆనాడే శాస్త్ర సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపాడన్నారు.

రాజీవ్ గాంధీ సాంకేతిక రంగాన్ని భారతదేశానికి తీసుకువచ్చి గ్రామ గ్రామాన సాంకేతిక వ్యవస్థను రూపొందించి విద్యావ్యవస్థలను మెరుగుపరిచి గ్రామాలలో ప్రజలను విద్య వైపు పయనింపజేశాడన్నారు.

 

విద్యా వ్యవస్థను మెరుగుపరిచి గ్రామస్థాయిలో కూడా సాంకేతిక వ్యవస్థకు మూలకారకుడైన వ్యక్తి స్వర్గీయ రాజీవ్ గాంధీ, యువతను దేశ భవిష్యత్తుపై ఆలోచింపజేసే విధంగా 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి యువతకు రాజకీయంలో ప్రాధాన్యత, భారతదేశ అత్యున్నత నిర్మాణానికి యువతను భాగస్వాములుగా చేయడం జరిగిందన్నారు.

ఇటువంటి అనేకమైన కార్యక్రమంలో ముందుచూపుగా తీసుకొనబట్టే నేడు ప్రపంచంలోనే భారతదేశం యువత సాంకేతికత రంగంలో దూసుకు వెళ్తున్నారని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో రామలింగయ్య, గాయం ఉపేందర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదిల శ్రీనివాస్, తమ్మడపైన అర్జున్, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ చిలుకూరి బాలు, ఉపాధ్యక్షులు నాగు నాయక్, మున్సిపల్ కౌన్సిలర్లు జలంధర్ రెడ్డి, కొమ్మననాగలక్ష్మి , గంధం రామకృష్ణ , పొదిలి వెంకన్న, గుంజ శ్రీనివాస్ , వర్కింగ్ ప్రెసిడెంట్ సలీం, ఎన్ఎస్ యూఐ జిల్లా ప్రెసిడెంట్ ఆరిఫ్ , ఐ ఎన్ టి సి జిల్లా ప్రెసిడెంట్ సోమయ్య, బసవయ్య గౌడ్, వెంకటేష్ గౌడ్, పాతూరు ప్రసాద్, గౌస్, రవీందర్ రెడ్డి , చాంద్ పాషా, వెంకటకృష్ణ, నాగిరెడ్డి ,అవుట శ్రీను, అబ్దుల్లా ,శరత్ తది తదితరులు పాల్గొన్నారు.