సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన పురాతన రాక్షస గుళ్ళు – latest news

సూర్యాపేట జిల్లాలో వెలుగు చూసిన పురాతన రాక్షస గుళ్ళు

అర్వపల్లి , సెప్టెంబర్ 19, మనసాక్షి : సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని జాజిరెడ్డిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని కంచ గట్టు గుట్టమీద ఉన్నవి కొత్త రాతియుగం నాటి సమాధులను రాష్ట్ర ఆర్కియాలజీ ఏడి బుజ్జి అన్నారు. సోమవారం జాజిరెడ్డిగూడెంలోని కంచ గట్టుగుట్ట పరిసరాలలో ఉన్న రాక్షస గుల్లను  తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. గతంలో రాతి కట్టడాలను పరిశీలించిన స్థానిక పంచాయతీ కార్యదర్శి నర్సింగ లింగస్వామి రాక్షస గుల్లపై ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మరియు తెలంగాణ హెరిటేజ్ వారికి వీటిని పరిశీలించాలని ఫోటోలు ఆధారాలతో పాటు ఫిర్యాదు చేయడం జరిగింది.

ALSO READ : 14కేసుల్లో పాత నేరస్తుడు కీచుగాడు అరెస్ట్

పై అధికారుల ఆదేశాలతో ఈరోజు ఈ ప్రదేశాన్ని సందర్శించి కొత్త రాతి యుగం నాటి సమాధులుగా పేర్కొన్నారు వీటి పైన ఇంకా సుదీర్ఘ అధ్యయనం జరిపే అవకాశం ఉందని చారిత్రాత్రిక కట్టడాలను కాపాడే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉండాలని అన్నారు. పై అధికారులకు నివేదికను అందజేసి చారిత్రాత్మక కట్టడాలు గల గ్రామంగా గుర్తింపు వచ్చేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు నర్సింగ లింగస్వామి మహేష్ సైదుల సతీష్ బొబ్బలి వెంకన్న వీరన్న సోమయ్య వారికి సహకరించినట్లు తెలిపారు.