బిగ్ బ్రేకింగ్ : ఆర్బిఐ కీలక ఉత్తర్వులు… రూ. 2 వేల నోట్లు రద్దు..!

బిగ్ బ్రేకింగ్ : ఆర్బిఐ కీలక ఉత్తర్వులు… రూ. 2 వేల నోట్లు రద్దు

మనసాక్షి ,వెబ్ డెస్క్:

రెండు వేల రూపాయల నోట్ల చలామణి పై ఆర్బిఐ కీలక ప్రకటన జారీ చేసింది. 2000 రూపాయల నోట్ల నిలిపివేశామని ఆర్బిఐ ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు 2000 నోట్లు ఇవ్వద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.

 

ఇవి తక్షణమే అమలులోకి రానున్నట్లు పేర్కొన్నది. 2000 రూపాయల నోట్లోను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్లు ఆర్బిఐ ప్రకటించింది. కాగా ఈనెల 23 నుంచి 2000 రూపాయల నోట్లను మార్చుకునే అవకాశం కల్పించింది. బ్యాంకులు ఆర్బిఐ కార్యాలయాల్లో నోట్లు మార్చుకునే అవకాశం కల్పించింది.

 

2016 నవంబర్ లో 2000 రూపాయల నోటు జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు రెండు వేల రూపాయల నోట్లు చెల్లుబాటు అవుతాయని ఆర్బిఐ ప్రకటించింది.

2018 -19 ఆర్థిక సంవత్సరంలోనే 2000 నోట్ల ముద్రణ నిలిపివేసినట్లు ఆర్బిఐ పేర్కొన్నది . ఈనెల 23వ తేదీ నుంచి 2000 రూపాయల నోట్లు మార్చుకునే అవకాశం కల్పించింది. రోజుకు 20వేల రూపాయల చొప్పున మార్చుకునే అవకాశం కల్పించింది. ఆర్బిఐ ఆదేశాలు తక్షణమే అమలులోకి రానున్నాయి.