ఖుదాబక్ష్‌పల్లి గుట్టలలో రియల్ మాఫియా?

కోట్లు సంపద కురిపిస్తున్న గుట్టలు?

ఖుదాబక్ష్‌పల్లి గుట్టలలో రియల్ మాఫియా?

కోట్లు సంపద కురిపిస్తున్న గుట్టలు?

మర్రిగూడ, మన సాక్షి:

మర్రిగూడ మండలంలోని ఖుదాబక్ష్‌పల్లి  గ్రామంలో గల గుట్టలలో మళ్లీ రియల్ మాఫియా  కలకలం సృష్టిస్తుంది. ఈ భూములు మంచాల మండలంలోని బండలేమురు నుండి లోయపల్లి. ఖుదాబక్ష్‌పల్లి. సోమరాజు గూడా. అంతంపేట.వరకు వేల ఎకరాలలో ఈ గుట్టలు విస్తరించి ఉన్నాయి.

ఇటీవలే ఎన్నో అక్రమాలకు అడ్డాగా మారిన  ఈ గుట్టలు అంతుచిక్కని రహస్యంగా మారాయి. ఇవి రియాల్టర్లకు మరియు రెవెన్యూ సిబ్బందికి బంగారు బాతు లాంటివి. ఇవి గతంలో కొందరు ప్రముఖులు రైతుల నుండి వేల ఎకరాలు కొనుగోలు చేసి  రిజిస్ట్రేషన్ కు బదులు జీ పీ ఏ చేయించుకున్నారు.

ALSO READ ; Software : ఈ కోర్సులు నేర్చుకుంటే సాఫ్ట్ వేర్ ఉద్యోగం గ్యారెంటీ.. అవేంటో తెలుసుకుందాం..!

ధరణి వచ్చిన తర్వాత మళ్లీ పాత రైతులకి  ఆ భూముల పాస్ బుక్కులు వచ్చినవి. కానీ ఈసీ మాత్రం పాత కొనుగోలుదారుల పేర్లు ఉన్నాయి.  ఇదే అదును చేసుకొని రియాల్టర్లు  రైతుల నుండి  ఒక లక్ష రూపాయలకు తీసుకుని తీసుకొని. ఏడు నుండి 12 లక్షల వరకు క్రయవిక్రయాలు జరిపారు.

పాస్ పుస్తకాలలో రైతుల పేర్లు.ఈసీ లో మాత్రం  కొనుగోలుదారుల పేర్లు.  దీనిని అడ్డం పెట్టుకొని రెవెన్యూ అధికారులు ఎకరానికిఇంత పర్సంటేజ్  తీసుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో రెవెన్యూ ఉన్నతాధికారి కి భారీ మొత్తంలో ముడుపులు అందాయని రైతులు ఆరోపిస్తున్నారు.

దీనిపై మర్రిగూడ మండల తాసిల్దార్ ను వివరణ కోరగా. ప్రస్తుతం ఆ గుట్ట భూముల రిజిస్ట్రేషన్ ను ఆపివేయడం జరిగిందని చెప్పారు.

ALSO READ : Whatsapp : త్వరలో ఈ ఫోన్లలో వాట్సప్ బంద్.. లిస్ట్ ఇదిగో..!