Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువిద్యసూర్యాపేట జిల్లా

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో సీట్ల భర్తీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

తెలంగాణ ఆదర్శ పాఠశాలలో సీట్ల భర్తీ.. దరఖాస్తుల ఆహ్వానం..!

పెన్ పహాడ్ ప్రతినిధి, మనసాక్షి :

తెలంగాణ ఆదర్శ పాఠశాల అనాజిపురం లో ఆరవ తరగతికి మరియు ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మిగిలిపోయిన సీట్లకు జనవరి 6 నుండి 28 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోడి లింగయ్య తెలిపారు.

ఆన్లైన్లో అప్లై చేసుకున్న విద్యార్థులు ఏప్రిల్ 3 నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని మరియు ఎంట్రెన్స్ ఎగ్జామ్ ఏప్రిల్ 13 న నిర్వహించబడును అని తెలియజేశారు. అడ్మిషన్ కొరకు ఆన్లైన్లో అప్లై చేయుటకు ఓసి విద్యార్థులు 200 రూపాయలు మరియు బిసి ఎస్సి ఎస్టి పిహెచ్సి ఈడబ్ల్యూసి విద్యార్థులు 125 చెల్లించి http//telanganams.gov.in అప్లై చేసుకోవలెను.

అనాజిపురం ఆదర్శ పాఠశాల పక్కా భవనం మరియు సువిశాల ప్రాంగణము, ఆహ్లాదకరమైన ఆట స్థలము ,మధ్యాహ్న భోజనము, ఉచిత స్కూల్ యూనిఫార్మ్స్, ఉచిత పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, మినరల్ వాటర్ సౌకర్యం, ప్రయోగశాలలు కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, డిజిటల్ క్లాసుల తో బోధనా.సూర్యాపేట నుండి, చెట్ల ముకుందాపురం వయా పెన్ పహాడ్ నుండి దోస పహాడ్ నుండి అనాజిపురం ఆదర్శ పాఠశాల వరకు ఉచిత బస్సు సౌకర్యం కలదు. క్రమశిక్షణను దేశభక్తిని పెంపొందించే ఎన్సిసి , సౌకర్యాలతో పాటు, అంకితభావం, అనుభవంతో కూడిన అధ్యాపక బృందం కలరు.

ఇంగ్లీష్ మీడియం లో బోధనా అనుభవం కలిగిన ఉత్తమ ఉపాధ్యాయ బృందం చే నిత్యం ఆంగ్ల భాష నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ మరియు భావ వ్యక్తీకరణ నైపుణ్యాలను మెరుగుపరచుటకై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు.
మిగిలిన వివరాలకు పాఠశాలలో ఈ నెంబర్లో సంప్రదించగలరు. 9989636205,

MOST READ : 

మరిన్ని వార్తలు