ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..!

ప్రజలంతా జాతీయ భావం పెంపొందించుకోవాలని తహసిల్దార్ విష్ణు సాగర్, ఎంపిడిఓ ముజఫరోద్దీన్ అన్నారు.75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, కంగ్టి , తడ్కల్ మండలాలతో పాటు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు.

ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..!

ప్రజలంతా జాతీయ భావం పెంపొందించుకోవాలి

కంగ్టి, మన సాక్షి :-

ప్రజలంతా జాతీయ భావం పెంపొందించుకోవాలని తహసిల్దార్ విష్ణు సాగర్, ఎంపిడిఓ ముజఫరోద్దీన్ అన్నారు.75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, కంగ్టి , తడ్కల్ మండలాలతో పాటు అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణతంత్ర స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉందని తెలిపారు.రాజ్యాంగ సృష్టికర్త అంబేద్కర్ స్ఫూర్తితో దేశ ఐక్యతను చాటుతూ ప్రతీ ఒక్కరూ గణతంత్ర వేడుకలను జరుపుకోవాలని సూచించారు.

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిధిలోని అన్ని గ్రామాలలో 75వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో ముజఫరోద్దీన్,ఎమ్మార్వో కార్యాలయంలో తహసిల్దార్ విష్ణు సాగర్, సీఐ కార్యాలయంలో సీఐ హనుమంతు, పోలీస్‌ స్టేషన్లో ఎస్ఐ విశ్వజన్, ప్రాథమిక అరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్‌ నాగమణి,

వ్యవసాయ కార్యాలయంలో ఏవో ప్రవీణ్‌ చారి,ఐకెపి కార్యాలయంలో ఏపిఎం ధనరాజ్‌ గిరి, జెడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో విట్టల్‌ నాయక్‌,తడ్కల్ జడ్బీహెచ్‌ఎస్‌ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు రహిమొద్దీన్‌, కేంద్ర ప్రాథమిక పాఠశాలలో వెంకటేష్‌ గ్రామ సచివాలయ కార్యాలయంలో కార్యదర్శి జ్ఞాన్ దేవ్,వివిధ గ్రామాల ప్రభుత్వ పైవేటు కార్యాలయాలలో పాఠశాలల్లో గ్రామ నచివాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఎంపిపి సంగీత వెంకటరెడ్డి,జడ్పిటిసి కోట లలిత ఆంజనేయులు, గ్రామ సర్పంచ్ లు, ఎంపిటిసి లు , ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు,యువజన సంఘాల నాయకులు, గ్రామ ప్రజలు విద్యార్ధిని విద్యార్థలు తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : తెలంగాణ : రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు.. మీ సేవలో చేసుకోవాల్సిందే..!