రేవంత్ వ్యాఖ్యల్లో తప్పులేదు – జగ్గారెడ్డి

రేవంత్ వ్యాఖ్యల్లో తప్పులేదు – జగ్గారెడ్డి

హైదరాబాద్ , మన సాక్షి : టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో తప్పులేదని ఆ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు కూడా ఒకప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేని అని ఇటీవల రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని, ఆయన నిజమే మాట్లాడాడని జగ్గారెడ్డి పేర్కొన్నారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కు రాజధాని అమరావతి ఉండాలన్నారు. జగన్, షర్మిల బిజెపి ఆధీనంలో పనిచేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిలకు రాజకీయ అవగాహణ లేదన్నారు.