రేవంత్ రెడ్డి తో కోమటిరెడ్డి

రేవంత్ రెడ్డి తో కోమటిరెడ్డి

హైదరాబాద్, మనసాక్షి :

గాంధీభవన్ లో భువనగిరి పార్లమెంట్ సభ్యులు, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యక్షమయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ ఇంచార్జికి కొన్ని సూచనలు చేసినట్లు కోమటిరెడ్డి వెల్లడించారు.

తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా 50 నుంచి 60 స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ముందస్తుగానే ప్రకటించాలని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికలకు ముందస్తుగానే సిద్ధం కావాలని సూచించినట్లు వెంకట్ రెడ్డి తెలిపారు.