రేవంత్ రెడ్డి అరెస్ట్.. గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

రేవంత్ రెడ్డి అరెస్ట్.. గన్ పార్క్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!

హైదరాబాద్, మన సాక్షి :

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు రోజుల క్రితం కెసిఆర్ కు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్దామని గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి రావాలని సవాల్ విసిరారు.

కాగా రేవంత్ రెడ్డి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద ప్రమాణం చేయడానికి వచ్చారు. ఆయనతోపాటు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ కూడా ఉన్నారు. దాంతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడం తో పర్మిషన్ లేదని పోలీసులు వారిని అడ్డుకున్నారు. గన్ పార్క్ వద్ద సోమవారం నిరసనలు తెలిపేందుకు పర్మిషన్ ఎలా ఇచ్చారని పోలీసులతో ఆగ్వాదానికి దిగారు.

ఈ క్రమంగా పోలీసులతో కాంగ్రెస్ నేతలకు వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట కూడా జరిగింది. కాగా ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రేవంత్ రెడ్డి తో పాటు అంజన్ కుమార్ యాదవ్ ని కూడా అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. వారిని అరెస్టు చేసే సందర్భంలో కార్యకర్తలు అడ్డుకోవడంతో తీవ్ర ఉధృతత నెలకొంది.

ALSO READ : నల్లగొండలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన ఆరుగురు కౌన్సిలర్లు..!