Jannah Theme License is not validated, Go to the theme options page to validate the license, You need a single license for each domain name.
Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District Collector : రైస్ మిల్లర్లు త్వరగా బ్యాంక్ గ్యారంటి ఎగ్రిమెంట్ ఇవ్వాలి..!

District Collector : రైస్ మిల్లర్లు త్వరగా బ్యాంక్ గ్యారంటి ఎగ్రిమెంట్ ఇవ్వాలి..!

సూర్యాపేట, మనసాక్షి:

సూర్యాపేట జిల్లాలోని రైస్ మిల్లర్ల యాజమానులు త్వరగా ప్రభుత్వంతో బ్యాంక్ గ్యారంటి అగ్రిమెంటు చేసుకొవాలని అధనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లాలోని రైస్ మిలర్ల యాజమానులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్టాడుతూ నూతనంగా విడుదల చేసిన జి.ఓ.నెం.21.27 ప్రకారం ఏలాంటి డిపాల్ట్ లేని రైస్ మిల్లర్లు 10% బ్యాంక్ గ్యారంటీ లేదా 25% సెక్యూరీటి డిపాజిట్ చేయాలని అన్నారు.

సంబంధిత సివిల్ సప్లయ్ మేనేజర్ దగ్గర అగ్రిమెంట్ సంబంధించి పేపర్లు ఉన్నాయని, వాటిని పూర్తి చేసి ఇవ్వాలని చెప్పారు.ఇంకా రైస్ మిల్లర్లకు ఎటువంటి బ్యాంక్ కు సంబందించిన సమస్యలు, సందేహాలు ఉంటే లీడ్ బ్యాంక్ మేనేజర్ ను సంప్రదించాలని మరియు సంబంధిత రైస్ మిల్లుల యాజమానులు ప్రస్తుతం వరి కొతలు చురుకుగా సాగుతున్నందున ప్రతి రోజు మిల్లులకు వచ్చే వరి దాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లర్లు దిగుమతి చేసుకొని నిల్వ చేసుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ప్రసాద్, జిల్లా పౌర సరఫరాల అధికారి డి. రాజేశ్వర్, లీడ్ బ్యాంక్ మేనేజర్ బాపూజీ, ఎస్ బి ఐ రిజనల్ మేనేజర్, జిల్లాలోని రైస్ మిల్లర్ల యాజమానులు పాల్గొన్నారు.

MOST READ : 

మరిన్ని వార్తలు