దుబ్బాక : రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి..!

ఎమ్మెల్యే సహాయ చర్యలు

దుబ్బాక, మనసాక్షి :
రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం దుబ్బాక మండలం చీకుడు గ్రామ శివారులో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు ఇలా ఉన్నాయి.

 

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన ఎండి. ఇర్ఫాన్( 30) అనే వ్యక్తి తన స్కూటీపై ప్రయాణిస్తున్న సమయంలో చీకోడ్ ప్రాంతంలో స్కూటీ అదుపుతప్పి కింద పడడంతో బలమైన గాయాలు తగలడంతో ఎక్కడికక్కడే మృతి చెందింట్లు దుబ్బాక ఎస్సై బత్తుల మహేందర్ తెలిపారు.

 

అదే సమయంలో గంభీర్పూర్ గ్రామం నుండి దుబ్బాక వైపు వస్తున్న దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు ఆయన వాహనాన్ని ఆపి మృతి చెందిన ఇర్ఫాన్ ని చూసి మృతదేహన్ని పోస్టుమార్టం దుబ్బాక ప్రభుత్వాసుపత్రికి తరలించే విధంగా సహాయక చర్యలు చేశారు. వారి కుటుంబ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.