రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

పెన్ పహాడ్ , మన సాక్షి ;

ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం లోని సింగారెడ్డి గ్రామ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం…

మండల పరిధిలోని సింగారెడ్డి పాలెం గ్రామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం దూత సైదులు  (32), నారాయనగుడెం గ్రామము మునగాల మండలం అను వ్యక్తి సిడి డీలక్స్ మోటార్ సైకిల్ పై తన స్వంత పని మీద పొనుగోడు గ్రామమునకు వెళ్ళుతు మార్గమధ్యలో సింగారెడ్డిపాలెం గ్రామశివారులోని ములమలుపు వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్ డ్రైవర్ తన ట్రాక్టర్ ను అతి వేగంగా అజాగ్రత్తగా నడిపి దూత సైదులు మోటార్ సైకిల్ కి టక్కరు ఇవ్వగా బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతిని

తల్లి యశోద, దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నర్సింగుల వెంకన్న గౌడ్ తెలిపినారు.