రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తల మృతి

లక్షేట్టిపేట్ , (మన సాక్షి);

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం గుల్లకోట స్టేజి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందారు. మృతులు బత్తుల శంకరయ్య(60), బత్తుల లక్ష్మి. (54)

 

వీరిది దండేపల్లి మండలం మామిడిపల్లి గ్రామానికి చెందినవారు శంకరయ్య సింగరేణి రిటైర్డ్ ఉద్యోగి. బుధవారం ఉదయం వేంపల్లి గ్రామంలో ఒక వివాహానికి హాజరై తిరిగి బైక్ పై వెల్లి తిరిగి ఇంటికి వస్తుండగా మద్యాహ్నం 2.10నిమిషాల సమయంలో తన వెనుకాలనే లక్షెట్టిపేట వైపు వస్తున్న లారీ డ్రైవర్ తన లారీని అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటు వచ్చి బలంగా డీకొట్టడంతో ఇద్దరు అక్కడిక్కడే చనిపోయారు.

 

లారీ డ్రైవర్ లారీని వదిలి పారిపోయాడు. ప్రమాదానికి కారణమైన లారీని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని లక్షెట్టిపేట ఎస్సై లక్ష్మణ్ తెలిపారు.