సూర్యాపేట : పొడి చెత్తను త్రిబుల్ ఆర్ సెంటర్ కి ఇవ్వండి …నగదు పొందండి

పొడి చెత్తను త్రిబుల్ ఆర్ సెంటర్ కి ఇవ్వండి …నగదు పొందండి
సూర్యాపేట, మనసాక్షి :
సూర్యాపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ మరియు కమీషనర్ రామాంజుల రెడ్డి సూచనల మేరకు నిర్వహిస్తున్న పొడి చెత్త కొనుగోలు కార్యక్రమం విద్యానగర్ 45 వ వార్డు నందు విజయవంతం చేయాలని 45 వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ తెలిపారు.
గృహ,వ్యాపార,వాణిజ్య యజమానులు తమ ఇంట్లోని పొడి చెత్త (నోట్ పుస్తకాలు,ప్లాస్టిక్ వస్తువులు,పాత చెప్పులు,యుజుడ్ క్లాత్ (పాత బట్టలు), బాటిల్స్, కాగితాలను, రేకులు, ఇతరత్రా పొడి చెత్త వస్తువులను వారి వారి ఇంట్లో భద్రపరిచి పురపాలక సంఘము ,సూర్యాపేట ఆధ్వర్యంలో 45 వార్డ్ లోని ప్రధాన సెంటర్ నందు శనివారం నుండి వారానికి ఒక్క రోజు నిర్వహించే ఆర్ ఆర్ ఆర్ సెంటర్లకు అందించి కిలో ఒక్కంటికి రూ 5/- లు వెంటనే నగదు పొందాలని వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ తెలిపారు.
ఈ పధకం వార్డు ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తడి చెత్తను మున్సిపాలిటీ ట్రాక్టరు కు అందించాలని అన్నారు.