Miryalaguda : సన్నధాన్యంకు రూ.500 బోనస్ లో మెలిక.. రైతులకు అందని ద్రాక్ష.!

Miryalaguda : సన్నధాన్యంకు రూ.500 బోనస్ లో మెలిక.. రైతులకు అందని ద్రాక్ష.!
మిర్యాలగూడ, మన సాక్షి
కాంగ్రెస్ ప్రభుత్వం సన్నధాన్యం పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ పేరుతో మోసం చేస్తుందని రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. మిర్యాలగూడలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన సన్నధాన్యం ఐకెపి కేంద్రాలలో విక్రయించుకోలేరని, కేవలం మిల్లుల్లో మాత్రమే విక్రయించుకోగలుగుతారని పేర్కొన్నారు.
మిల్లుల్లో విక్రయించుకున్న సన్నధాన్యంకు ప్రభుత్వం బోనస్ ఇవ్వకుండా కేవలం ఐకెపిలో విక్రయించుకున్న ధాన్యంకే బోనస్ ఇస్తామని మెలిక పెట్టిందన్నారు. దాంతో ప్రభుత్వం ప్రకటించిన బోనస్ రైతులకు అందని ద్రాక్షగా మారిందని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా సన్నధాన్యానికి రూ 500 బోనస్ ఎలాంటి షరతులు లేకుండా అందజేయాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా రూ 7,500 ఎకరానికి ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం వానకాలం సీజన్ ముగిసిపోతున్నా ఇంతవరకు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. రైతులు సగటున ఎకరానికి 30 క్వింటాళ్ల ధాన్యం పండిస్తున్నారని దీనికి బోనస్ రూవ15,000 ఇవ్వాల్సి ఉంటుందని రైతు భరోసా ఇవ్వలేని ప్రభుత్వం బోనస్ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు.
రైతులంతా ఎమ్మెల్యేలు మంత్రులను ప్రశ్నించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రైతులంతా పార్టీలకతీతంగా ఏకతాటి పైకి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసి న్యాయం జరిగేంత వరకు ఉద్యమించాలన్నారు. వాన కాలంలో రైతులు పండించిన సన్న రకం దాన్యం మొత్తానికి ప్రభుత్వ మద్దతు ధర రూ.2310 బోనస్ 500 కలిపి 2810 చెల్లించాలన్నారు. ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ రైతులను మోసం చేస్తుందని విషయం రైతులకు అర్థమైందని అన్నారు.
ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ 46% మందికి కూడా దక్కలేదని, మిగతా రైతులకు 100% రుణమాఫీ చేయాలన్నారు. సమావేశంలో భరాస మండల పార్టీ అధ్యక్షుడు మట్టపల్లి సైదులు యాదవ్, మార్కెట్ డైరెక్టర్ జగదీష్, మాజీ సర్పంచ్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Gold Price : పసిడి పండింది.. మొదటి షాక్, 2024 నవంబర్ 6న బంగారం ధర..!
-
Viral Video : అమెరికాలో పీఠం ఎక్కేది ఎవరో తేలిపోయింది.. హిప్పో జోస్యం.. (వీడియో వైరల్)
-
Indiramma House : రేషన్ కార్డు లేకున్నా ఇందిరమ్మ ఇల్లు.. మంజూరు ఎలాగంటే..!
-
Runamafi : రుణమాఫీ కోసం అధికార పార్టీ ఎమ్మెల్సీ కమిషనర్, కలెక్టర్ కు వినతి..!









