తెలంగాణBreaking Newsజిల్లా వార్తలునారాయణపేట జిల్లాహైదరాబాద్

Groups : గ్రూప్ 1 ర్యాంకులు సాధించిన ఆర్టీసి బిడ్డలు.. సన్మానించిన ఆర్టీసీ ఎండి సజ్జానార్..!

Groups : గ్రూప్ 1 ర్యాంకులు సాధించిన ఆర్టీసి బిడ్డలు.. సన్మానించిన ఆర్టీసీ ఎండి సజ్జానార్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

టీజీ పి ఎ స్సి గ్రూప్ 1 లో ర్యాంకులు సాధించిన ఆర్టీసి కార్మికుల బిడ్డలను బుధవారం హైదరాబాద్ లో టీజీఎస్. ఆర్టీసి ఎండి. వి సి. సజ్జనార్ ఘనంగా సన్మానించారు. నారాయణపేట ఆర్టీసి డి పోలో పని చేస్తున్న ఇద్దరు కార్మికుల కూతుళ్ళు టీ జి పి ఎస్సీ గ్రూప్ 1 లో అసమాన ప్రతిభ కనబరిచి ఒకర్ డిప్యూటీ కలెక్టర్ గా మరొకరు డీస్పిగా ఉద్యోగాలు సాధించారు.

నారాయణపేట డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న ఎరుకలి శ్రీనివాస్ మొదటికూతురు కుమారి వీణ 484.5 మార్కులతో 118 వ ర్యాంకు సాధించింది. మల్టీ జోన్ లో 3వ ర్యాంక్ సాధించింది. అలాగే డిపోలో ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండ్ గా పనిచేస్తున్న వాహిద్ కూతురు ఫాహీమినా ఫైజ్ 126 వ ర్యాంక్ సాధించింది.

వారిని వారి తల్లిదండ్రులను ఎం డి. సజ్జనార్ హైద్రాబాద్ కు పిలిపించుకుని ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతు నారాయణపేట డిపో నుంచి ఇద్దరు,వనపర్తి డిపో నుంచి ఒకరు గ్రూప్ 1లో సత్తా చాటడం ఆర్టీసి కే గర్వకారణమని అన్నారు.

ఆర్టీసి కార్మికులుగా తీరిక లేకుండా ఉద్యోగం చేస్తూ పిల్లల భవిష్యత్తుకి పాటుపడి వారిని తీర్చిదిద్దిన తల్లిదండ్రుల కృషి అభినందనీయం అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని కార్మికులను కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఆర్ ఎం లు,ఈ డి,డి ఎం లావణ్య లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

MOST READ :

  1. Job Mela : 4న జాబ్ మేళ.. పదవ తరగతి , ఐటిఐ , ఇంటర్ అర్హతలతో ఉద్యోగాలు..! 

  2. Ration Cards : రేషన్ కార్డు ఉన్నవారికి మరో భారీ గుడ్ న్యూస్.. బిగ్ అప్డేట్..!

  3. Traffic : మీ బండ్లకు, కార్లకు ఈ చలాన్లు చెల్లించడం లేదా.. అయితే భారీ షాక్.. కొత్త పెనాల్టీలు..!

  4. Groups : ఆర్టీసీ ఉద్యోగుల కూతుళ్ళు.. డిప్యూటీ కలెక్టర్లు గా ఎంపిక..!

  5. Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!

మరిన్ని వార్తలు