Runa Mafi : రుణమాఫీ పై అపోహలు.. నమ్మొద్దు..!

రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం అని రైతుబంధు అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 69 వేల 315 మంది రైతు రుణమాఫీ అర్వులకు 2693 కోట్ల రుణమాఫీ రావాల్సి ఉన్నదన్నారు.

Runa Mafi : రుణమాఫీ పై అపోహలు.. నమ్మొద్దు..!

విడతలవారీగా ప్రతి ఒక్కరికి రుణమాఫీ

రైతుబంధు జిల్లా అధ్యక్షులు చింత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి

నలగొండ, మనసాక్షి :

రైతును రాజు చేయడమే కేసీఆర్ లక్ష్యం అని రైతుబంధు అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  జిల్లా కేంద్రంలోని కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 2 లక్షల 69 వేల 315 మంది రైతు రుణమాఫీ అర్వులకు 2693 కోట్ల రుణమాఫీ రావాల్సి ఉన్నదన్నారు.

వీరికి విడతలవారీగా ఒక లక్ష 65 వేల 35 మంది రైతులకు ఒక వెయ్యి 44 కోట్లు రూపాయల రుణమాఫీ రైతుల ఎకౌంట్లో జమ చేయడం జరిగిందన్నారు. ఒక లక్ష ఐదువేల మందికి రుణమాఫీ రావాల్సి ఉందని రైతులు ఎలాంటి అపోహలకు గురికా వద్దని త్వరలోనే అందరికీ రుణమాఫీ జమ చేయడం జరుగుతుందని అన్నారు.

ALSO READ : నల్గొండ : బిఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్.. గుత్తా ముఖ్య అనుచరుడు కాంగ్రెసులో చేరిక..!

గత 60 సంవత్సరాలుగా వ్యవసాయ రంగాన్ని పాలకులు పట్టించుకోలేదని రాష్ట్రం ఏర్పడిన తర్వాత కెసిఆర్ సారథ్యంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో రోల్డ్ మోడల్ గా నిలిచిందన్నారు.వ్యవసాయ రంగానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తూ రైతు బంధు పేరుతో వ్యవసాయానికి పెట్టుబడి సాయం, రైతుకు ప్రమాదం జరిగితే రైతు బీమా అందిస్తున్న ఘనత కేసీఆర్ దేనాని అన్నారు.

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తూ మార్కెట్ ఏర్పాటుచేసి ప్రతి గింజ కొనుగోలు చేసి రైతు ఎకౌంట్లో డబుల్ జమ జరుగుతుందన్నారు.దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి పథకాలు అమలు చేయలేదని పథకాల అమలు చేయాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు.

అందుకు నల్గొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు. రుణమాఫీ పడని రైతులకు జిల్లా వ్యవసాయ కార్యాలయంలో గ్రీవెన్స్ డే ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.

ALSO READ : Google Pay : గూగుల్ పే ఈజీ లోన్ రూ.15000, ఈఎంఐ కేవలం రూ. 111 మాత్రమే..!